9 అవర్స్ (9 Hours) వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ డైరెక్ట‌ర్ క్రిష్!

Updated on May 15, 2022 08:36 PM IST
9 అవర్స్ మూవీ పోస్ట‌ర్ (9 Hours Movie Poster)
9 అవర్స్ మూవీ పోస్ట‌ర్ (9 Hours Movie Poster)

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) ఓటీటీ మరో ఆస‌క్తిక‌ర‌ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. '9 అవర్స్' (9 Hours) పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ కు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్... షో రన్నర్ గా వ్యవహరిస్తుండటం విశేషం. నంద‌మూరి తారకరత్న, న‌టులు అజయ్, వినోద్ కుమార్, మధు షాలినీ, రవి వర్మ, ప్రీతి అస్రానీ తదితరులు ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ సీరీస్ ను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి వై, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కు నిరంజన్ కౌషిక్, జాకోబ్ వర్గీస్ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ డిస్నీప్ల‌స్ హాట్ స్టార్ లో జూన్ 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. జైలు శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ఖైదీలు ఓ భారీ దొంగతనానికి ప్లాన్ చేయడమనే పాయింట్ తో ఈ సిరీస్ రూపొందుతోంది. 

జైలు నుంచి తప్పించుకున్న ఆ ఖైదీలు ఓ బ్యాంకులోకి చొరబడిన తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయ‌నే పాయింట్ తో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. జైలు నుంచి తప్పించుకున్న ఆ ముగ్గురు బ్యాంక్ లోకి ఎలా చొరబడ్డారు, అక్కడ వాళ్లు అనుకున్న ప్లాన్ వర్కవుట్ అయ్యిందా.. ఒక‌వేళ వ‌ర్క‌వుట్ కాలేదంటే ఏం జ‌రిగింది. ఇంతలో పోలీస్ తీసుకున్న చర్యలేంటి అనేది ఈ వెబ్ సిరీస్ లో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. కాగా, ఈ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ (First Look)‌ గురువారం రిలీజ్ అయింది. ఈ పోస్ట‌ర్‌లో ద‌క్క‌న్ ఇంపీరియ‌ల్ బ్యాంక్ కోఠి 95 అనే బోర్డ్ ఆస‌క్తిని పంచుతోంది. చేతిలో తుపాకులతో ముసుగు ధరించి కనిపిస్తున్న కొందరు వ్యక్తులు ఇందులో ఉన్నారు. పోలీస్ డ్రెస్ లో వెన‌క్కి తిరిగిన మరొక వ్య‌క్తి ఇందులో కనిపిస్తున్నారు. ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నే విష‌య‌మే ఆస‌క్తిని పంచుతోంది.

కాగా, ద‌ర్శ‌కుడు క్రిష్ ప్ర‌స్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Klyan) హీరోగా నటిస్తున్న హరిహరవీరమల్లు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ గ్యాప్ లోనే క్రిష్ వెబ్ సిరీస్ తెర‌కెక్కించి త్వరలోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయనే షో రన్నర్ గా '9 అవర్స్' (9 Hours) పేరుతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. అయితే, ఈమ‌ధ్య‌ నిడివి కార‌ణంగా వెండితెర‌పై చూపించ‌లేని కొన్ని క‌థ‌ల్ని ప్రేక్షకులకు చూపించడానికి వెబ్ సిరీస్ లు చక్కటి మార్గంగా మారాయి. క‌రోనా వ‌ల్ల ఈ వెబ్‌సిరీస్ ల‌కు మంచి ఆద‌ర‌ణ పెరుగుతుండ‌టంతో అగ్ర ద‌ర్శ‌కులు సైతం వీటిని తెర‌కెక్కించేందుకు ఆస‌క్తిని చూపుతున్నారు.

Advertisement
Credits: Disney plus Hotstar Telugu

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!