‘సొంతం’ సినిమాలో పెద్ద క్యారెక్టర్ అని చెప్పారు.. 5 సెకన్లు ఉన్నా.. మేజర్‌‌ ప్రమోషన్స్‌లో అడివి శేష్‌ (Adivi Sesh)

Updated on May 13, 2022 01:10 AM IST
మేజర్‌‌ సినిమాలో అడివి శేష్‌
మేజర్‌‌ సినిమాలో అడివి శేష్‌

మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా మేజర్‌. శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యంగ్‌ హీరో అడివి శేష్‌ (Adivi Sesh) ప్రధాన పాత్ర పోషించాడు. జూన్‌ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను మహేష్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మించింది. మే 9న మేజర్‌ ట్రైలర్‌ రిలీజై మంచి రెస్పాన్స్‌ రాబట్టింది.

మేజర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అడివి శేష్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. తన అసలు పేరు అడివి సన్నీ కృష్ణ అని అమెరికాలో ఉన్నప్పుడు అందరూ సన్నీలియోన్‌ అని ఏడిపిస్తుండడంతో అడివి శేష్‌గా మార్చుకున్నాను అని చెప్పాడు. అమెరికాలో హీరోగా ఎందుకు ప్రయత్నించలేదన్న ప్రశ్నకు అడివి శేష్‌ స్పందిస్తూ.. 'అక్కడ భారతీయులకు టెర్రరిస్ట్‌, పెట్రోల్‌ బంకులో పనిచేసే వ్యక్తి.. ఇలాంటి పాత్రలే ఇచ్చేవారు. అక్కడ ఇండియన్‌ హీరో కాలేడు. ఇప్పుడు కూడా హాలీవుడ్‌లో బాగా పాపులర్‌ అయిన ఇండియన్స్‌ కమెడియన్‌ రోల్స్‌లోనే కనిపిస్తారని అన్నాడు అడివి శేష్.

'చందమామ సినిమాలో హీరోగా ముందు నన్నే అనుకున్నారు. నవదీప్‌ స్థానంలో నేను చేయాల్సింది. రెండు రోజుల షూటింగ్‌ తర్వాత సినిమా షూటింగ్‌ కేన్సిల్‌ అయింది. ఆర్యన్‌ రాజేష్‌ చేసిన ‘సొంతం’ సినిమాలో పెద్ద రోల్‌ ఉందన్నారు. అయితే సినిమాలో ఐదు సెకన్లున్నానంతే. సందీప్‌ ఉన్నికృష్ణన్‌ ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు, కానీ ఆయన ఎలా బతికారనేది చాలామందిరి తెలియదు. అదే మేజర్‌‌ సినిమాలో తెలుస్తుంది. మహేశ్‌బాబు లేకుంటే మేజర్‌‌ సినిమా సాధ్యమయ్యేది కాదు అని అడివి శేష్ (Adivi Sesh) పేర్కొన్నాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!