Biggboss Non Stop: బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్న‌ర్ ఎవ‌రు..? జ‌బ‌ర్ద‌స్త్ గీతూ రాయ‌ల్ జోస్యం ఇదే !

Updated on May 22, 2022 06:10 PM IST
గీతూ రాయల్ (Geetu Royal)
గీతూ రాయల్ (Geetu Royal)

గీతూ రాయల్ (Geetu Royal).. ఈ మధ్యకాలంలో బుల్లితెరతో పాటు, సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. చిత్తూరు యాసలో గీతూ రాయల్  ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎలాంటి బెరుకు లేకుండా మాట్లాడుతూ  తెగ సందడి చేస్తోంది.

అంతేకాకుండా, ఆమె త‌న యూట్యూబ్ ఛానెల్లో ఎమోషనల్ డైలాగులు.. ప్రేమ విషయంలో, బ్రేకప్ విషయంలో సెంటిమెంట్ డైలాగులు చెబుతూ బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఈమె చెప్పిన డైలాగ్ వీడియోలు షేర్ చాట్‌లో నిత్యం ట్రెండింగ్ అవుతూనే ఉంటాయి.

గీతూ గతంలో తన బిగ్ బాస్ రివ్యూస్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. 'గలాటా గీతూ' పేరుతో ఆమె రివ్యూస్ చెప్పేది.ఇప్పుడు కూడా 'గలాటా గీతూ రాయల్ ' పేరుతో ఒక ఛానల్ ప్రారంభించి, బిగ్ బాస్ OTT సంబంధిత రివ్యూస్‌ను అందులో పోస్ట్ చేస్తోంది.

ఇక పోతే, ఈ మధ్యనే ఈమె ఈటీవీ కామెడీ షో 'జబర్దస్త్‌' లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ షో ద్వారా మరింత రెట్టింపు పాపులారిటీని సంపాదించుకుంది గీతూ. 

ప్రస్తుతం తెలుగులో ప్రసారమ‌వుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో (Biggboss Non Stop) చివరి దశకు  చేరుకుంది.  ఈ శనివారం నాడు, ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరగబోతోంది. ఈ క్రమంలో హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన‌ బిందుమాధవి (Bindu Madhavi), అఖిల్‌ల మధ్య గట్టి పోటీనే నెలకొంది. వీరిద్దరితోపాటు మ‌రో ఇద్దరు కంటెస్టెంట్లు అరియానా, యాంకర్ శివ కూడా గట్టిగానే పోటీ ఇస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతూ రాయల్.. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ విన్నర్ ఎవరనే విషయంపై స్పందించింది. అరియానా కానీ.. లేదంటే యాంకర్ శివ కానీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. వాళ్ళిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని.. చాలా జెన్యూన్‌గా ఆడుతున్నార‌ని గీతూ తెలిపింది. మరి గీతూ రాయల్ చెప్పిన దాని ప్రకారం బిగ్ బాస్ OTT విన్నర్ ఎవరో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!