బిగ్ బాస్ నాన్ స్టాప్ (BiggBoss Nonstop) లో రోజురోజుకీ మారుతున్న ఓటింగ్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవ‌రంటే?

Updated on May 05, 2022 06:17 PM IST
అషు రెడ్డి, అనిల్ రాథోడ్ (Anil Rathod, Ashu Reddy)
అషు రెడ్డి, అనిల్ రాథోడ్ (Anil Rathod, Ashu Reddy)

భారతదేశంలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో తొలిసారిగా ఈ షో 24గంట‌లు ప్ర‌సార‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు ఎవరూ ఊహించని రీతిలో అనూహ్య‌ స్పందనను దక్కించుకుంది. దీంతో దేశంలోనే మరే షోకూ రాని రేటింగ్‌ను బిగ్ బాస్ అందుకుంటోంది. అయితే, సీజన్లు మారుతున్న కొద్దీ ఈ రియాలిటీ షో ప్రేక్షకాదరణను పెంచుకుంటూ రేటింగ్స్ లో దూసుకుపోతోంది. తెలుగులో ఇలా ఇప్పటికే ఐదు సీజన్లు స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అయ్యాయి. అయితే, ఈ ఐదు సీజన్లు ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా సక్సెస్ అయ్యాయి.

ఈ షో ప్ర‌స్తుతం టీవీలో కాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నా కూడా దీనికి ఆదరణ బాగానే పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇందులో సరికొత్త టాస్కులతో పాటు బోల్డు కంటెంట్‌ను హైలైట్ చేస్తున్నారు. దీంతో ఈ సీజన్ మరింత రంజుగా సాగుతోంది. ఫలితంగా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది.

దీంతో ఈ జోష్‌తోనే ప్ర‌స్తుతం నిర్వాహకులు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను తీసుకొచ్చారు. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో ఈ షో ప్ర‌స్తుతం ప్ర‌సార‌మవుతోంది. అయితే, షో మొద‌లైన కొత్త‌లో 24గంటలూ నిర్విరామంగా ప్రసార‌మ‌యిన షో ప్ర‌స్తుతం ఒక గంట‌కు కుదించ‌బ‌డింది. అయితే ఇందులో కూడా జనాలు మెచ్చే కంటెంట్ నే హైలైట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా షాకింగ్ ఎలిమినేషన్స్‌తో అభిమానుల‌కు, కంటెస్టెంట్ల‌కు షాకిస్తున్నారు. ఈ నేపథ్యంలో పదో వారం జరుగుతున్న ఓటింగ్ వివరాలను తెలుసుకుందాం.

అయితే, బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి తొలి రోజు 17 మంది సెల‌బ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. ఈ సారి కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా హౌస్‌లో అడుగుపెట్టారు. వీళ్లలో 9 వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీ మ‌డివాడ‌, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా, అజయ్, హమీదాలు షో నుంచి ఎలిమినేట్ అయ్యారు.

ఇక‌, పదవ‌ వారానికి నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా 7మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. దీంతో ఈ వారం జరుగుతున్న ఓటింగ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ బిందు మాధవి మరోసారి మొదటి స్థానానికి చేరుకుంది. దీంతో అఖిల్ రెండో స్థానానికి పడిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఇక, ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం మూడో స్థానంలో యాంకర్ శివ, నాలుగో స్థానంలో మిత్రా శర్మ, ఐదో స్థానంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అరియానా గ్లోరీలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. 

మ‌రోవైపు అషురెడ్డి అషు రెడ్డి, అనిల్ రాథోడ్ చాలా తక్కువ ఓట్లతో డేంజర్‌ జోన్‌లోకి వెళ్లిన‌ట్లు అన‌ధికార ఓటింగ్ ద్వారా తెలుస్తోంది. అయితే, ఈ వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ హౌస్ ల‌కి ఎంట్రీ ఇచ్చాడు. ఈ టాస్కులో అనిల్ చక్కగా ఆడడంతో అతడికి ఓటింగ్ పెరిగిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఈ వారం హైడ్రామా జరగకపోతే అషు రెడ్డి ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!