బిగ్ బాస్ నాన్ స్టాప్ (BiggBoss Nonstop): ఈ సారి విన్న‌ర్ కాబోయేది లేడీనే.. ఆ కంటెస్టెంట్ ఎవ‌రంటే?

Updated on May 02, 2022 06:21 PM IST
బిందు మాధ‌వి, అఖిల్ (Bindu Madhavi, Akhil Sarthak)
బిందు మాధ‌వి, అఖిల్ (Bindu Madhavi, Akhil Sarthak)

తెలుగు లో మొద‌టి సారిగా 24గంట‌ల బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ షో చివ‌ర‌కు వ‌చ్చేసింది. త్వ‌ర‌లో గ్రాండ్ ఫినాలే జ‌ర‌గ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో బిగ్ బాస్ నాన్ స్టాప‌ విన్నర్ విషయంలో ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ అయ్యేలా క‌నిపిస్తోంది. ఇప్పటి వరకు తెలుగులో జరిగిన ఐదు సీజన్ల‌లో ఏ సీజ‌న్ల‌లోనూ జరగనిది.. ఈ ఓటీటీ ఫస్ట్ సీజన్‌లో జరిగేలా కనిపిస్తోంది. ఇదివ‌ర‌కు జ‌రిగిన సీజ‌న్ల‌లో గెలిచిన వారు అంద‌రూ మ‌గ‌వారే. దీంతో తొలిసారి ఓ లేడీ కంటెస్టెంట్ ఈ సారి టైటిల్ కొట్టేలా కనిపిస్తోంది. ప్ర‌తీ సీజ‌న్ లోనూ ఈ మాట ఇది వరకే చాలా సార్లు వినిపించింది. కానీ ఈ సారి అది నిజ‌మ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. తాజాగా ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లోనూ కంటెస్టెంట్ల‌ ఫ్యామిలీ మెంబర్లు కూడా తమ తీర్పును ఇచ్చారు. ఇందులో అరియానా తరుపున వచ్చిన మాజీ కంటెస్టెంట్ దేవీ నాగవల్లి మాత్రం కరెక్ట్ ఆర్డర్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.

ఆదివారం జ‌రిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ పెట్టిన ఆర్డర్లో కచ్చితంగా బిగ్ బాస్ ఆడపులి బిందు మాధవి, యాంకర్ శివ, అఖిల్ ఉన్నారు. అందులోనూ మరీ ముఖ్యంగా బిందు మాధవిని అందరూ రెండో స్థానంలోనే పెట్టారు. ఇక కంటెస్టెంట్ల త‌రుపున వ‌చ్చిన వారు తమ తమ వారి పేరును ఫస్ట్ ప్లేస్‌లో పెట్టారు. అయితే, అరియానా త‌రపున వ‌చ్చిన‌ దేవీ నాగవల్లి మాత్రమే అరియానా చెల్లి మృగనయని కాద‌ని.. ఆమె పెట్టిన ఆర్డర్‌ను మార్చేసింది. ఈ క్ర‌మంలో అరియానా చెల్లి పెట్టిన ఆర్డ‌ర్ ప్ర‌కారం ఫస్ట్ ఫ్లేస్‌లో అరియానా ఉంది. ఆ త‌ర్వాత దేవీ ఆ ఆర్డ‌ర్ ను తీసేసి నాలుగో స్థానంలోకి వేసింది. రెండో స్థానంలో ఉన్న‌ బిందు మాధవిని మొదటి స్థానంలోకి పెట్టేసింది.

ఇదిలా ఉండ‌గా.. సోష‌ల్ మీడియాలో సైతం బిగ్ బాస్ ఆడ‌పులి బిందు మాధ‌వి పేరు మార్మోగిపోతోంది. షో మొద‌లైనప్ప‌టి నుంచీ బిందు, అఖిల్ మ‌ధ్య తీవ్ర‌మైన వార్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. వారి మ‌ధ్య జ‌రుగుతున్న వార్ ప్ర‌కారం ప్రేక్ష‌కులు సైతం విన్న‌ర్ పై ఓ అంచనాకు వ‌చ్చేశారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్న‌ర్ బిందు మాధ‌వేన‌ని తేల్చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న సారూప్య‌త‌ల‌ను చూసి ఈ ఇద్ద‌రి కంటెస్టెంట్ల‌కు స‌పోర్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ మొద‌లైన‌ప్ప‌టి నుంచీ ఇంట్లోని ఇత‌ర స‌భ్యుల‌నుంచి అఖిల్ తీసుకున్న స‌పోర్ట్, సేఫ్ గేమ్, సింప‌థీ గేమ్ ప‌రంగా ప్రేక్ష‌కులు కంటెస్టెంట్ల‌కు ఓట్లు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ సారి బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్న‌ర్ కాబోయేదేన‌ని లేడీనే అని తెలుస్తోంది. 

బిందు-అఖిల్ మ‌ధ్య వ్య‌త్యాసాలు (Similarities Between Akhil and Bindu)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!