BiggBoss Nonstop : అఖిల్ సార్థ‌క్ చేసిన ప‌నికి మండిప‌డ్డ న‌ట‌రాజ్ మాస్ట‌ర్!

Updated on May 13, 2022 05:12 PM IST
అఖిల్ సార్థ‌క్, న‌ట‌రాజ్ మాస్ట‌ర్ (Natraj Master, Akhil Sartak)
అఖిల్ సార్థ‌క్, న‌ట‌రాజ్ మాస్ట‌ర్ (Natraj Master, Akhil Sartak)

బిగ్ బాస్ నాన్ స్టాప్ (BiggBoss Nonstop) గ్రాండ్ ఫినాలేకి సిద్ద‌మ‌వుతోంది. రెండు వారాల్లో ఈ షో ముగియ‌బోతోంది. దీంతో ఈ వారం హౌస్​లో​ నటరాజ్ మాస్టర్ హైలైట్ అవుతున్నారు. తాజాగా జ‌రిగిన‌ నామినేషన్ ప్ర‌క్రియ‌లో బిందు మాధ‌వికి,  బాబాభాస్కర్​కి ఆయన ఎదురుతిరిగాడు. ఎప్ప‌టిలాగే.. తనదైన స్టైల్​లో మాటలు విసురుతూ రెచ్చిపోయాడు. దీంతో విసుగుచెందిన‌ హౌస్ మేట్స్ నటరాజ్ మాస్టర్​ని లైట్ తీసుకుంటున్నారు. ఆయన ఎప్పుడూ ఇలాగే ఉంటారు కదా అనే ఉద్దేశంతో పట్టించుకోవట్లేదు. ఇదిలా ఉంటే.. బిగ్​బా​స్.. హౌస్​లో ఉన్న ప్ర‌తి సభ్యుడికీ నేరుగా ప్రేక్షకులతో మాట్లాడే అవ‌కాశం ఇచ్చాడు. దీని ద్వారా ఇంటి స‌భ్యులు నేరుగా ఓట్ కోసం అప్పీల్ చేసుకోవ‌చ్చు. ఇందులో భాగంగా బిగ్ బాస్.. హౌస్ మేట్స్​కు అప్పటికే ఏర్పాటు చేసిన‌ పూల‌ను కలెక్ట్ చేసి తోటని నిర్మించాల్సి ఉంటుంది. ఏ కంటెస్టెంట్ అయితే.. ఎక్కువ పూలని క‌లెక్ట్ చేస్తారో వారికి ఓటు అప్పీల్ చేసుకునే అర్హత లభిస్తుంది. అలాగే, గేమ్​లో నుంచీ వైదొలగిన సభ్యులు వేరేవాళ్లకి సపోర్ట్ చేయవ‌చ్చు. ఇక్కడే బిగ్ బాస్​లో అసలు కథ మొదలైంది. గేమ్ చివరికి వచ్చేసరికి అనిల్, నటరాజ్ మాస్టర్ , అఖిల్ మాత్రమే మిగిలారు. 

చివ‌రిలో అఖిల్ దగ్గర తక్కువ పూలు ఉండ‌డంతో నటరాజ్ మాస్టర్ (Natraj Master) నువ్వు ఎలిమినేట్ అవుతున్నావ్ కదా, నాకు సపోర్ట్ చేయమని అడిగాడు. కానీ, అఖిల్ తన టీమ్​లో ఉన్న అనిల్​కి లాస్ట్ టైమ్ సపోర్ట్ చేయలేదని, ఇప్పుడు పే బ్యాక్ చేసే టైమ్ వచ్చిందని చెప్తాడు. ఈ కారణంతో అనిల్​కి అఖిల్ సపోర్ట్ చేశాడు. దీంతో టాస్క్​లో ఓడిపోయిన న‌ట‌రాజ్ మాస్ట‌ర్ కోపం తెచ్చుకొని బరెస్ట్ అయిపోయాడు. టాస్క్ పూర్తిగా అయిపోయిన తర్వాత పైకి చూస్తూ దేవుడితో మాట్లాడుతూ మనసులోని ఆవేదననంతా పంచుకున్నాడు. నాకు హౌస్ మేట్స్ సపోర్ట్ ఫస్ట్ నుంచీ లేదని, కనీసం ఆడియన్స్ తో మొరపెట్టుకుందామనుకున్నా.. ఇప్పుడు అది కూడా లేకుండా చేశావంటూ రెచ్చిపోయి మరీ అరుస్తూ మాట్లాడారు.

ఇదంతా జ‌రుగుతుండ‌గానే.. ఇంటి స‌భ్యులంతా గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. హౌస్​ ఎవ్వరూ సపోర్ట్ చేయట్లేదు.. అందరికీ ఫ్యాన్స్ ఉన్నారు. అందరికీ సపోర్ట్ ఉంది నాకు మాత్రమే లేదని వాపోయారు. టాప్ 5లోకి వెళ్లకపోతే వేస్ట్ అని, నన్ను చంపేయ్ అంటూ దేవుడితో మాట్లాడుతూ బరెస్ట్ అయిపోయారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన అఖిల్ (Akhil Sartak) వచ్చి మాస్టర్​తో మాట్లాడే ప్రయత్నం చేయ‌గా.. నువ్వు మోసం చేశావని, నేను చాలాసార్లు హెల్ప్ చేశానని అఖిల్​తో అన్నాడు మాస్టర్. దీంతో అఖిల్ నాకు ఎవరికి సపోర్ట్ చేయాలనిపిస్తే వాళ్లకే చేస్తానని, ఇది నా గేమ్ అంటూ మాట్లాడాడు. అయితే, నటరాజ్ మాస్టర్ ఇలా బాధపడుతుంటే హౌస్ మేట్స్ చూడలేకపోయారు. అరియానా వచ్చి వారిస్తూ.. మాస్టర్ మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్తూ... మాస్టర్​ని కూల్ చేసే ప్రయత్నం చేసింది. చివర‌గా.. నటరాజ్ మాస్టర్ కాలు నొప్పి పుడుతున్నా, నా బిడ్డకోసమే రెక్కలు ముక్కలు చేసుకుని  గేమ్ ఆడుతున్నానంటూ చెప్పుకొచ్చాడు. మిగ‌తా ఇంటి స‌భ్యులు బాబా భాస్కర్, మిత్రా, అరియానా వారిస్తున్నా వినిపించుకోలేదు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!