9 Hours: తార‌క‌రత్న ప్ర‌ధాన పాత్ర‌లో "9 అవర్స్" వెబ్ సిరీస్.. జూన్ 2 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్!

Updated on Jun 04, 2022 05:28 PM IST
9 అవర్స్ పోస్ట‌ర్ (9 Hours Poster)
9 అవర్స్ పోస్ట‌ర్ (9 Hours Poster)

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ+ హాట్ స్టార్ (Disney Plus Hotstar).. ప్రేక్ష‌కుల‌కు ఎప్పటికప్పుడు అమితమైన వినోదాన్ని అందించి వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు, డైరెక్ట్ డిజిటల్ రిలీజులతో పాటుగా ఒరిజినల్ కంటెంట్‌ని సైతం అందిస్తోంది. హాట్ స్టార్ సరికొత్త కథలతో ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లను రూపొందిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వ‌స్తోంది. 

ఈ నేపథ్యంలో ఈ సంస్థ ప్ర‌స్తుతం ''9 అవర్స్'' (9 Hours) అనే వెబ్ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయడానికి సిద్దం అయింది. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ వెబ్ సిరీస్‌కు కథ అందించడమే కాకుండా.. షో రన్నర్‌గా వ్యవహరించారు. ఇందులో నందమూరి తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధు షాలినీ, రవి వర్మ, ప్రీతి అస్రానీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులకు మంచి ఆసక్తిని కలిగించాయి. తెలుగుతో పాటుగా తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది.

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి వై, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు నిరంజన్ కౌషిక్, జాకోబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూర్చగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు స్వీకరించారు. రాజ్ కుమార్ గిబ్సన్ ప్రొడక్షన్ డిజైనింగ్.. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ విభాగాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ అఫిషియల్ ట్రైలర్ (Trailer) ను మెగా హీరో వరుణ్ తేజ్ ఈ శనివారం ఉదయం విడుదల చేశారు. 

'మూడు బ్యాంకులు.. మూడు దొంగతనాలు.. ఎలాగైనా తప్పించుకోగలమనే నమ్మకం.. దొరికితే తప్పించుకోడానికి ఓ పధకం.. ఎవరున్నారు దీని వెనకాల' అని తారకరత్న చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. జైలులో ఎప్ప‌టినుంచో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ఖైదీలు తప్పించుకుని దొంగతనం చేయడానికి వేసిన భారీ ప్లానే '9 అవర్స్' (9 Hours) కథాంశమని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

రెండు బ్యాంకుల్లో దోపిడీ చేసి పరారైన దొంగలు, మూడో బ్యాంక్‌లో మాత్రం అమాయకులను బందీలుగా పట్టుకుంటారు. తమ డిమాండ్స్ నెరవేర్చకుంటే ఒక్కొక్కరిని చంపేస్తుంటారు.ఈ దోపిడీ కేసును పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ తారకరత్న డీల్ చేస్తుంటాడు. పోలీసులకు, దొంగలకు జరిగిన ఈ యుద్ధంలో గెలుపెవరిది అనే అంశం ఉత్కంఠను రేపుతోంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటంతో వెబ్ సిరీస్ పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!