ఆచార్య (Acharya) సినిమాలో కాజ‌ల్ కు జ‌రిగిందే గెట‌ప్ శ్రీనుకు జ‌రిగిందా..?

Updated on May 01, 2022 09:54 PM IST
గెటప్ శ్రీను, కాజ‌ల్ (Getup Srinu, Kajal Agarwal)
గెటప్ శ్రీను, కాజ‌ల్ (Getup Srinu, Kajal Agarwal)

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించిన‌ చిత్రం ‘ఆచార్య’ (Acharya). ఈ మూవీ ఏప్రిల్ 29న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ‌యిన‌ తొలి షో నుంచే మిశ్ర‌మ స్పంద‌న‌ తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. ఇదిలాఉంటే.. ఈ సినిమాలో కాజ‌ల్ హీరోయిన్ ప్ర‌క‌టించారు. ఆమెతో షూటింగ్ కూడా చేశారు. ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలను.. టీజర్‌లో కూడా కాజల్‌ను చూపించారు.

అయితే, ఆ త‌ర్వాత ఈ చిత్రం నుంచి ఆమె పాత్ర‌ను పూర్తిగా తొల‌గించారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆమె పాత్ర సంతృప్తికరంగా అనిపించక పోవడంతో ఆమె పాత్రను తొలగించినట్టు దర్శకుడు కొరటాల శివ వివరణ ఇచ్చారు. ఇదే విషయాన్ని కాజల్ కు చెప్పగా… ఆమె చిరునవ్వుతో సంతోషంగా పక్కకు తప్పుకుందని ఆయన అన్నారు. అయితే, చిత్రం నుంచి ఆమె తొలి షెడ్యూల్ తర్వాత తప్పుకున్నప్పటికీ… అప్పటికే తన రెమ్యునరేషన్ ను తీసేసుకుందట.   

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నుంచి ఇప్పుడు మరో నటుడు సీన్లు కూడా తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. జబర్దస్త్ కామెడి షో తో మంచి కమెడియన్ గా పేరు గెటప్ శ్రీను కు (Getup Srinu) కాజ‌ల్ లాంటి అనుభవమే ఎదురయిందనే ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా కోసం గెటప్ శ్రీను కాస్త ఎక్కువ రోజులే పని చేసాడని తెలుస్తోంది. మాంచి కామెడీ ట్రాక్ రన్ చేసారు. కానీ మరి ఏమయిందో ఫైనల్ ఎడిట్ లో ఎంటర్ టైన్ మెంట్ పార్ట్ లేచి పోయిందని సమాచారం. 

అస‌లే.. గెటప్ శ్రీనుకు మెగాస్టార్ అంటే ఎంతో అభిమానం. అలాంటిది చిరు సినిమాలో అవకాశం రాగానే.. పాపం శ్రీను ఎగిరి గంతేసి ఉంటాడు. అలాంటిది ఇప్పుడు… ఆయ‌న‌ సినిమాలోనే తన క్యారెక్టర్‌కు సంబంధించిన సీన్స్ తీసేసారని తెలిస్తే ఆ బాధ వర్ణించలేం.

అయితే, మామూలుగానే సినిమాలో నటించే ఎవరి సీన్లు అయినా ఎడిటింగ్ లో పోతే చాలా బాధగా ఉంటుంది. మంచి సీన్లు లేపేసారు అని లోలోపల న‌టీన‌టులు బాధపడుతుంటారు. అయితే ఓ పెద్ద సినిమాలో అవకాశం వచ్చినప్పుడు... వారి నటనకు తమ కెరీర్‌కు ప్లస్ అవుతుందని భావించినప్పుడు కూడా ఇలాంటివి జరిగితే ఆ బాధ మ‌రింత‌ రెట్టింపు అవుతోంది. ఇప్పుడు ప్రముఖ కమెడియన్ గెటప్ శ్రీను విషయంలో ఇదే జరిగింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!