బిగ్ బాస్ నాన్ స్టాప్ (Biggboss Nonstop) డ‌బుల్ ఎలిమినేష‌న్.. హౌస్ మేట్స్ మ‌ధ్య మొద‌లైన‌ చ‌ర్చ!

Updated on May 07, 2022 03:59 PM IST
బిగ్ బాస్ నాన్ స్టాప్ (Biggboss Nonstop)
బిగ్ బాస్ నాన్ స్టాప్ (Biggboss Nonstop)

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో ప్ర‌సార‌వ‌మ‌వుతున్న‌ బిగ్ బాస్ నాన్ స్టాప్ (Biggboss Nonstop) షో గ్రాండ్ ఫినాలే మ‌రికొద్ది రోజుల్లో జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో హౌస్ లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం కంటెస్టెంట్లు పోటీపడుతున్నారు. ఈ పోటీలో ఇంటి స‌భ్యులు అర్హత సంపాదించేందుకు మాజీ హౌస్ మేట్స్ గెస్ట్ లు గా వస్తున్నారు. ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ కోసం వారు ఇచ్చిన మిస్టరీ బాక్స్ కీలక రోల్ పోషించింది. ఈ మిస్ట‌రీ బాక్స్ వ‌ల్ల‌ యాంక‌ర్ శివ (Anchor Shiva) రెండు సార్లు టాస్క్ లో టాప్ ర్యాంక్ సంపాదించాక‌ కూడా అర్హతని సాధించలేకపోయాడు. అత‌ను ఒకసారి స్వాప్ చేసి బిందు మాధ‌విని పోటీలో నిలబెట్టాడు. మ‌రోసారి అఖిల్ ర్యాంక్ పైకి పాకడం వల్ల అర్హతని కోల్పోయాడు. దీనివల్ల‌ యాంకర్ శివ చాలా బాధపడ్డాడు. అయితే, ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ప్ర‌ధాన‌ పోటీదారుడిగా అఖిల్ ఎంపిక అయిన తర్వాత హౌస్ లో లెక్కలు మారిపోయాయి. ఈ నేప‌థ్యంలో బిగ్ బాస్ లో అఖిల్, నటరాజ్ మాస్టర్ లో పాస్ ఎవరికి అవసరం అనే దానిపై చ‌ర్చ‌ పెట్టాడు.

కాగా, ఒక‌వేళ‌ బాబా భాస్కర్ గెలిచినా.. ఈవారం మ‌రో కంటెస్టెంట్ ను సేఫ్ చేయాల్సిందే కానీ, తనకోసం వాడే అవ‌కాశం లేదని చెప్పాడు. అలాగే, తను గెలిస్తే వేరేవాళ్లకి అవసరం అయితే వాడతాడు అని, అది ఎవరికోసం వాడతాడు అనేది పాయింట్ అంటూ మాట్లాడాడు అఖిల్. ఇక‌, ఇదే విషయాన్ని నటరాజ్ మాస్టర్ మ‌రో కంటెస్టెంట్ అషూ రెడ్డితో కూడా చ‌ర్చించాడు. ఈవారం నేను పోటీలో లేనని, ఎలిమినేషన్ లోనూ లేనంటూ మాట్లాడాడు. అలాగే, నాకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ దొరికితే మాత్రం నిన్ను, ఇంకా అఖిల్ నే కాపాడతాను అని కూడా చెప్పాడు. 

ఈ నేప‌థ్యంలో అషూ రెడ్డికి ఈ ఎవిక్ష‌న్ పాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్లతో ఖచ్చితంగా అవసరం అనేది ఉంటుంది. అలాగే, బాబాభాస్కర్ గెలిస్తే ఈ పాస్ ని మిత్రా కోసం వాడతాడా లేదంటే అరియానా కోసం వాడతాడా అన్న‌ది చాలా ఆసక్తికరంగా మారింది. మరోవైపు అఖిల్ గెలిస్తే ఖచ్చితంగా త‌న స్నేహితురాలు అషూని సేఫ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈవారం ఒక‌వేళ‌ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఖచ్చితంగా అషూరెడ్డి డేంజర్ జోన్ లో ఉంటుంది. కాబట్టి, ఆమెని సేవ్ చేసేందుకు బిగ్ బాస్ టీమ్ ఈ ఎవిక్షన్ పాస్ అనే టాస్క్ ని తీసుకుని వచ్చిందని బిగ్ బాస్ లవర్స్ కామెంట్స్ చేస్తునే ఉన్నారు.
 
మరోవైపు ఈ పాస్ ని స్ట్రాంగ్ కంటెస్టెంట్ బిందుమాధవి (Bindu Madhavi) గెలిస్తే తనకోసం వాడతుందా లేదా డేంజర్ జోన్ లో త‌న స్నేహితుడు శివ ఉంటే అత‌ని కోసం ఆడుతుందా అన్న‌ది కూడా ఆసక్తికరమే. ఇక‌, అనిల్ రాథోడ్ గెలిస్తే ఖచ్చితంగా తనకోసమే వాడుకునే అవకాశమే ఎక్కువ‌గా ఉంది. ఎందుకంటే.. హౌస్ లో ప్ర‌స్తుతం అరియానా, అనిల్, అషూ ఈ ముగ్గురూ  డేంజర్ జోన్ లో కనిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మరి ఈ వీకండ్ ఎలాంటి ట్విస్ట్ ఉంటుందనేది చూడాల్సిందే.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!