Biggboss Season6: బిగ్ బాస్ హౌస్ లో శ్రీహాన్ (Shrihan), ఇనయా (Inaya) మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందా..?
Biggboss Season6: బిగ్ బాస్ సీజన్ 6లో నిన్న మొన్నటి వరకు శత్రువులుగా ఉన్న శ్రీహాన్ (Shrihan), ఇనయా (Inaya) కలిసిపోయినట్టుగా అనిపిస్తోంది. అంతకుముందు వరకూ శ్రీహాన్, ఇనాయ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ నడుస్తోన్న విషయం తెల్సిందే. నామినేషన్స్ లో ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఫైర్ అవ్వడం, ఒకరిని ఒకరు మాటలు అనుకోవడం జరుగుతూ వచ్చాయి. అయితే ఆ గొడవలు ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులకు కూడా ఫన్ గానే అనిపిస్తూ వచ్చింది. అయితే నిన్నటి ఎపిసోడ్ నుంచి ఇనయా వైపు నుండి మార్పు మొదలైనట్లు కనిపిస్తోంది.
అసలు విషయంలోకి వెళ్తే...శ్రీహాన్ (Shrihan) పుట్టినరోజు కోసమని ఇంటి సభ్యులు కేక్ తయారు చేస్తున్నారు. అందులో "శ్రీహాన్ కాదు చోటు అని రాయు" అని అనడంతో రేవంత్ ఆశ్చర్యపోయాడు. పక్కనే ఉన్న శ్రీసత్య (Sri Satya) అది విని, శ్రీహాన్ దగ్గరకెళ్ళి, "ఇనయా కేక్ మీద చోటు అని రాయమంది. నిన్ను చోటు అని అంటోంది." అని శ్రీసత్య చెప్పగా అందరూ ఆశ్చర్యపోయారు.
ఆ తర్వాత "అలాగే కేక్ పై హార్ట్ సింబల్ వెయ్" అని గీతుతో (Geetu Royal) చెప్తుంది. ఇనయా అలా అనేసరికి ఆశ్చర్యపోయింది గీతు. కేక్ పై హార్ట్ సింబల్ అని ఇనయా అనడంతో హౌస్ లో అందరు సంథింగ్ సంథింగ్ అని అనుకుంటున్నారు. ఇదంతా చూసిన శ్రీహాన్ ‘ఈరోజు నా కొంప ముంచేలా ఉన్నారు’ అంటూ తల పట్టుకున్నాడు. ఈలోపే శ్రీసత్య, కీర్తి భట్ సైలెంట్‌గా వచ్చి ‘హ్యాపీ బర్త్‌డ్ ఛోటు’ అంటూ శ్రీహాన్‌కి విషెస్ చెబుతారు.
అనంతరం బిగ్‌బాస్ అందరినీ సమావేశపరచి కొత్త టాస్క్ ఇచ్చాడు. బుధవారం ఎపిసోడ్ అంతా భోజనం కోసం పొట్లాడిన ఇంటి సభ్యులు గురువారం టాస్క్‌లో ఇంట్లో ఉండటానికి అర్హత కోసం పోరాటం అని బిగ్‌బాస్ సెలవిచ్చారు. ఇందులో భాగంగా రెండు టీమ్‌లుగా ఇంటి సభ్యులు విడిపోయి ఆట మొదలెట్డారు. ఈ టాస్క్‌లో తొలుత రేవంత్ (Singer Revanth), అర్జున్ మధ్య గొడవ మొదలైంది. ‘నువ్వెవడు నాకు చెప్పడానికి అంటే నువ్వెవడు’ అంటూ గొడవ పడ్డారు.