బిగ్ బాస్ సీజన్ 6 లో(Bigg Boss Season 6) రెండో వారం నామినేషన్ల రచ్చ.. కుండ బద్దలు కొట్టిన కంటెస్టెంట్స్..!

Updated on Sep 12, 2022 09:33 PM IST
గీతూ రాయల్ (Geetu Royal)-సింగర్ రేవంత్ మధ్య అరుపులు, కేకలతో బిగ్ బాస్ హౌస్ వేడెక్కిపోయింది.
గీతూ రాయల్ (Geetu Royal)-సింగర్ రేవంత్ మధ్య అరుపులు, కేకలతో బిగ్ బాస్ హౌస్ వేడెక్కిపోయింది.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో(Bigg Boss 6 Telugu) మొదటి వారం పూర్తి అయింది. వీకెండ్ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ లేదంటూ ట్విస్ట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. దీంతో హౌస్ మేట్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో రెండవ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించిన ప్రోమో కాసేపటి క్రితం విడుదలయింది. 

తాజాగా విడుదలైన ఈ ప్రోమోలో (Bigg Boss 6 Promo) ఇంటి సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచినట్లుగా తెలుస్తోంది. ఆరోహి, ఆదిరెడ్డి, కీర్తిభట్, సింగర్ రేవంత్ మధ్య బిగ్ ఫైట్ నడిచినట్లుగా తెలుస్తోంది. అయితే గత సీజన్లకు భిన్నంగా.. ఈ వారం ప్రతి ఒక్క ఇంటి సభ్యులకు నామినేట్ చేయడానికి కేవలం ఒక్క ఓటు మాత్రమే లభిస్తుందని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ పెట్టిన ఈ షరతుతో ఆట మరింత రసకందాయంలో పడ్డట్లయ్యింది. రెండో వారం నామినేషన్ నియమాల ప్రకారం (Biggboss 6 Nominations) హౌస్ మేట్స్ ఎవరినయితే నామినేట్ చేయాలని అనుకుంటారో వారి ఫోటో అంటించిన కుండను బావిలో వేసి పగుల కొట్టాల్సి ఉంటుంది. అలా ఇంటి సభ్యులు అందరూ కూడా తాము ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నామో వారి ఫొటోలు ఉన్న కుండలను బావిలో వేసి బద్దలు కొట్టారు.

ముందుగా ఆరోహి.. ఆదిరెడ్డితో (Aadi Reddy) తనకు బాండ్ లేదంటూ నామినేట్ చేసింది. దీంతో ఆదిరెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. ఈ ఇంట్లో ఆట ఆడని వాళ్లు వెళ్లిపోవాలా? నీతో ర్యాపో లేనివాళ్లు వెళ్లిపోవాలా? అని ఆదిరెడ్డి అడగ్గా.. ఆట ఆడని వాళ్లు అంటూ జవాబిచ్చింది ఆరోహి. నా పర్ఫామెన్స్ కనిపించలేదా? మీ కంటే అని ఆది రెడ్డి అనగా.. నా కంటే నాకంటేనా అంటూ ఆరోహి ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. ఏం ఇరగదీశావని ఆశ్చర్యపోతున్నావ్ అంటూ రివర్స్ అటాక్ చేశాడు ఆదిరెడ్డి.

మరోవైపు.. గీతూ రాయల్ (Geetu Royal)-సింగర్ రేవంత్ మధ్య అరుపులు, కేకలతో బిగ్ బాస్ హౌస్ వేడెక్కిపోయింది. చంటి కూడా గీతూ నామినేట్ చేస్తూ ఫెర్ఫెక్ట్ రీజన్స్ చెప్పేశాడు. అనంతరం షానీని శ్రీసత్య నామినేట్ చేయగా.. తనకి కోపం వచ్చేలా చేయమని వేడుకున్నాడు. ఇలా అన్న సమయంలో మిగతా కంటెస్టెంట్స్ అందరూ ముసిముసిగా నవ్వుకున్నారు. ఇక ఇనయా.. ఆదిరెడ్డిని నామినేట్ చేయగా, ఎదురుమాట్లాడిన ఆదిరెడ్డి.. హౌసులో ప్రతివారం తనని నామినేట్ చేసినా అస్సలు పట్టించుకోనని అంటాడు.

ఇక చివర్లో.. సింగర్ రేవంత్ (Singer Revanth)-కీర్తి భట్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడించింది. ఒకరిపై మరొకరు సహనం కోల్పోయి ఇష్టమొచ్చినట్లుగా అరుచుకున్నారు. మెరీనా, రోహిత్ జంట ఒక్కటే అయిన.. వాళ్లది రెండు మైండ్స్ పనిచేస్తున్నాయని ఆదిరెడ్డి అనగా.. ఇది బిగ్ బాస్ నిర్ణయం అని అన్నాడు రోహిత్. దీంతో బిగ్ బాస్ నిర్ణయాన్నే నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు ఆదిరెడ్డి. మొత్తానికి ఇలా ఫుల్ ఆన్ హాట్ హాట్ గా ప్రోమో సాగింది.

Read More: బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season 6): గొడవలతో దద్దరిల్లిపోతున్న హౌస్! తొలివారం కెప్టెన్ అతడేనా? ప్రోమో రిలీజ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!