బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season 6): గొడవలతో దద్దరిల్లిపోతున్న హౌస్! తొలివారం కెప్టెన్ అతడేనా? ప్రోమో రిలీజ్

Updated on Sep 09, 2022 03:43 PM IST
బిగ్ బాస్ సీజన్ 6 తొలివారం కెప్టెన్సీ పోటీదారులు (BalaAditya, RJ Surya, Rohit-Marina)
బిగ్ బాస్ సీజన్ 6 తొలివారం కెప్టెన్సీ పోటీదారులు (BalaAditya, RJ Surya, Rohit-Marina)

బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season 6) ప్రారంభమై ఇప్పటికే వారం పూర్తికావస్తోంది. అయితే, హౌస్‌లో తొలిరోజు నుంచే గొడవలు మొదలైన సంగతి తెలిసిందే. మొదటి వారంలో కంటెస్టెంట్స్ అందరూ సింగర్ రేవంత్‌నే (Singer Rebanth) ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

మరో కంటెస్టెంట్ గీతూ రాయల్ (Geetu Royal) అయితే, తనకు తాను ఒక మోనార్క్ మాదిరిగా ఫీల్ అవుతూ, అందరినీ డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

తొలివారానికి సంబంధించిన నామినేషన్స్ విషయానికి వస్తే.. ఏడుగురు హౌస్ మేట్స్ నామినేట్ అయ్యారు. అలాగే ఈ సీజన్‌లో మొదటి కెప్టెన్ కోసం బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ నిర్వహించాడు. ఇందులో ఫైమా (Faima) సంచాలకురాలిగా వ్యవహరించింది. కెప్టెన్సీ పోటీలో 21 మంది నుంచి ఆరుగురు హౌజ్ మెట్స్ పోటీ పడ్దారు.

కెప్టెన్సీ టాస్క్‌కి ముందు బిగ్ బాస్ నిర్వహకులు మూడు వర్గాలుగా హౌస్ సభ్యులను విభజించారు. క్లాస్ సెక్షన్‌లో ఉన్న గీతూ (Geetu Royal), ఆదిరెడ్డి, నేహా చౌదరి డైరెక్ట్‌గా కెప్టెన్సీ కంటెండర్లుగా మారగా, మాస్ సెక్షన్ నుంచి మరో ముగ్గురిని కెప్టెన్సీ కంటెండర్లుగా తమను తామే సెలెక్ట్ చేసుకోమని బిగ్ బాస్ చెప్పడం గమనార్హం. దీంతో ఒకే కంటెస్టెంట్‌గా ఉన్న మెరీనా - రోహిత్, ఆర్జే సూర్య, బాలాదిత్య కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంపికయ్యారు.

అయితే, టాస్క్ జరుగుతున్నప్పుడే, కంటెస్టెంట్ల మధ్య పెద్ద గొడవ జరిగింది. చీటింగ్ చేస్తుందంటూ మెరీనా గీతుపై ఫైర్ అయింది. దీనికి సంబంధించిన ప్రోమోను (Biggboss Promo) 'స్టార్ మా' విడుదల చేసింది. మరోవైపు ఫైమా - నేహా చౌదరిల మధ్య కూడా వాగ్వాదం జరిగినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. 

ఈ కెప్టెన్సీ ఫైట్‌లో భాగంగా, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో బాలాదిత్య (Baladithya) గెలిచినట్టు తెలుస్తోంది. దీంతో తెలుగు బిగ్ బాస్ సీజన్ 6  మొదటి కెప్టెన్‌గా బాలాదిత్య నిలవడం జరిగింది. హౌజ్‌లో ఇప్పటికే ఆయన చాలా కూల్ వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే ఆయన కెప్టెన్‌గా కూడా గెలవడంతో, ఆయన ఆట పై జనాలకు ఆసక్తి కూడా పెరిగింది. అంతేకాదు.. బాలాదిత్య యాటిట్యూడ్‌కి ఇప్పటికే ఆయనకు ఫ్యాన్స్ కూడా ఏర్పడిపోయారు.

Read More: Nandini Rai: ఐట‌మ్ సాంగ్స్ తో అద‌ర‌గొడుతున్న‌ బిగ్ బాస్ సీజ‌న్ 2 బ్యూటీ నందినీ రాయ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!