బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season6): రేవంత్ ఎంత త్వరగా వెళ్లిపోతే అంత మంచిదంటున్న గీతూ రాయల్ (Geetu Royal)..!
బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season6) ప్రారంభమై నాలుగు రోజులు పూర్తయింది. నామినేషన్స్ తర్వాతి ఎపిసోడ్ నుంచీ రంజుగా సాగుతోంది. హౌస్ మేట్స్‌కు నిద్రలేకుండా చేస్తూ హౌస్‌లో కుంపటి పెట్టాడు బిగ్ బాస్. దీంతో ఎవరూ తగ్గడం లేదు. నువ్వెంతంటే నువ్వెంత అన్నట్లుగా ఆరోపణలు చేసుకుంటున్నారు.
బిగ్ బాస్ సీజన్6 తొలి వారంలో మొత్తంగా ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్ లో ఉన్నారు. ఇక అందులో ఎవరెవరు బయటకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎక్కువగా రేవంత్ కు నెగిటివ్ ఓట్లు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక బిగ్ బాస్ లో అందరి ఫోకస్ కూడా అతనిపైనే ఉన్నట్లు తెలుస్తోంది. నేడు కంటెస్టెంట్స్ మధ్యలో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లుగా కూడా అర్థమవుతుంది. అందుకు సంబంధించిన ప్రోమో (Biggboss Latest Promo) కూడా విడుదల చేశారు.
ప్రోమోలో బాలాదిత్య, రేవంత్‌లు (Singer Revanth) నామినేషన్ల గురించి మాట్లాడుకుంటున్నారు. నామినేషన్లు ప్రతివారం జరిగేవేనని, జనాలేమీ నిన్ను తిట్టుకోవడం లేదని, కూల్‌గా ఉండమంటూ రేవంత్‌కు బాలాదిత్య క్లాస్ ఇస్తున్నట్లు కనిపించింది. ప్రతి వారం ఎవరో ఒకరు మరొకరిలో తప్పును చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుందని తెలిపాడు.
మరోవైపు నామినేషన్ లో ఉన్న ఇనయ సుల్తానా ఎందుకు అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు అంటూ వాపోయింది. అందుకు బాలదిత్యా (Bala Adithya) కూడా తనకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మీ బుర్రలో మీరు నా గురించి ఏం అనుకుంటున్నారరో నేను ప్లాన్ వేసి స్కెచ్ వేసి ఉహించలేను అంటూ నామినేషన్ కు సంబంధించిన గొడవను గుర్తు చేశారు. ఏదైనా ముఖం మీద చెబితే నేను ఫైట్‌కు సిద్ధమే అని ఇనయా సమాధానం ఇచ్చింది. ఇందుకు బాలాదిత్య స్పందిస్తూ.. ‘‘నేను ఫైట్ సిద్ధం కాదు చెల్లి’’ అని అన్నాడు.
ఇక, చలాకీ చంటి (Chalaki Chanti).. గీతూకు క్లాస్ పీకుతూ కనిపించాడు. ‘‘భగవంతుడు చెవులెందుకు ఇచ్చాడు. ఎక్కువ విని, తక్కువ మాట్లాడాలి’’ అన్నాడు. అంతేకాదు, నువ్వు మైండ్ లో ఒకటి ఫిక్స్ అయితే ఎవరు చెప్పినా వినవ్ అంటూ కన్ క్లూజన్ ఇచ్చాడు. ఆ తర్వాత గీతు రేవంత్ బిహేయర్ గురించి ఆదిరెడ్డి ఇంకా అర్జున్ లతో డిస్కస్ చేసింది. ఆయన బిహేవియర్ మారాలని ఇట్లాగే ఉంటే హౌస్ నుంచీ పోతాడంటూ జోస్యం చెప్పింది.
గీతూ (Geetu Royal) రేవంత్ గురించి మాట్లాడుతూ.. ‘‘రేవంత్ ఎంత త్వరగా వెళ్లిపోతే అంత మంచిది ఆయనకే. ఆయన హౌస్‌లో ఇంకొన్నాళ్లు ఉన్నాడంటే.. జనాలంతా ఏందీ ఇంత పెద్ద సింగర్ ఇట్లా చేస్తున్నాడని అనిపిస్తుంది’’ అని కామెంట్ చేసింది.