బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season 6) లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ సింగర్స్ హేమచంద్ర-శ్రావణ భార్గవి..?

Updated on Aug 27, 2022 10:39 PM IST
ప్రముఖ గాయకులు హేమచంద్ర-శ్రావణ భార్గవి (Sravana Bhargavi-Hemachandra)  బిగ్‌బాస్‌లో పాల్గొననున్నారని ఫిల్మ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. 
ప్రముఖ గాయకులు హేమచంద్ర-శ్రావణ భార్గవి (Sravana Bhargavi-Hemachandra) బిగ్‌బాస్‌లో పాల్గొననున్నారని ఫిల్మ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. 

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Telugu Biggboss) మరికొన్ని రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే 5 సీజన్లు, ఓటీటీ వేదికగా ఓ సీజన్‌ను ను పూర్తి చేసుకున్న ఈ గేమ్ షో ప్రస్తుతం సీజన్ 6లోకి అడుగు పెట్టింది. సెప్టెంబర్‌ 4 నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్లు ఇటీవలే స్టార్‌ మా (Star Maa) అధికారిక ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఇక, బిగ్ బాస్ సీజన్ 6లో (Biggboss Season 6) హౌస్ లోకి కంటెస్టెంట్లుగా ఎవరెవరు వెళ్లనున్నారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురి పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బిగ్ బాస్ 6లోకి ఓ కపుల్ కూడా వెళ్లనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ హౌస్‌లోకి వెళ్లే ఆ కపుల్ మరెవరో కాదు.. ప్రముఖ గాయకులు హేమచంద్ర-శ్రావణ భార్గవి బిగ్‌బాస్‌లో పాల్గొననున్నారని ఫిల్మ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. 

శ్రావణ భార్గవి-హేమచంద్ర (Sravana Bhargavi-Hemachandra) సింగర్లుగా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా శ్రావణ భార్గవి డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ.. హేమచంద్ర సూపర్ సింగర్ జూనియర్స్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించి మంచి గుర్తింపు పొందారు. అయితే, ఈ మధ్య కాలంలో ఈ ఇద్దరు విడిపోతున్నట్టుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అవన్నీ ఫేక్ అని సదరు నటీ నటులు పోస్ట్ ద్వారా స్పష్టం చేశారు. 

కూతురితో హేమచంద్ర-శ్రావణ భార్గవి (Tollywood Singers Sravana Bhrgavi Hemachandra With Their Daughter)

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ ప్రతి ఒక్క సీజన్లోనూ పలువురు యాంకర్లతో పాటు సింగర్లను కూడా కంటెస్టెంట్లుగా ఆహ్వానిస్తుంటారు. ఇందులో భాగంగానే గతంలో వరుణ్ సందేశ్-వితిక (Varun Sandesh-Vithika) బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. 

కాగా గత 3 సీజన్లుగా తెలుగు బిగ్‌బాస్‌కు హోస్ట్‌ చేస్తూ షోని సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ చేస్తున్నారు కింగ్‌ నాగార్జున (Nagarjuna). ఇక ఈ 6వ సీజన్‌కు కూడా ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇటీవల బిగ్‌బాస్‌కు సంబంధించిన విడుదలైన ప్రోమోకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 

Read More: Telugu Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 6 నుంచి బిగ్ సర్ ప్రైజ్.. సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం.. ప్రోమో రిలీజ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!