Biggboss 6: బిగ్ బాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలో సరికొత్తగా సీజన్ 6 అధికారిక ప్రకటన !

Updated on Aug 05, 2022 05:14 PM IST
బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు (Biggboss Season 6) సంబంధించిన లోగో వచ్చేసింది. లోగో చూస్తుంటే ఎంతో క్రియేటివిటీగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు (Biggboss Season 6) సంబంధించిన లోగో వచ్చేసింది. లోగో చూస్తుంటే ఎంతో క్రియేటివిటీగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

తెలుగు బుల్లితెరపై రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss Telugu) ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పటికే ఐదు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. త్వరలో ఆరో  సీజన్‌కు రెడీ అవుతోంది. గతేడాది సెప్టెంబర్ నెలలో బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆరో సీజన్‌ను కూడా సెప్టెంబర్‌లోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారట. ఈ క్రమంలో తాజాగా అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది.

ఇటీవలే బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు (Biggboss Season 6) సంబంధించిన లోగోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ లోగోను చూస్తుంటే, ఎంతో క్రియేటివిటీతో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ లోగోలో ఎన్నో విశిష్టతలున్నాయని కూడా అర్థమవుతోంది.

ఈ లోగోలో పొందుపరిచిన ఛారలు, లైన్స్, బిగ్ బాస్ ఐ.. ఇవి అన్నీ కూడా చాలా వెరైటీగా ప్లాన్ చేశారు. ఈ అంశాలపై స్టార్ మా యాజమాన్యం వివరణ కూడా ఇచ్చుకుంది. అన్ని వయస్కుల వారిని ఆకట్టుకునేలా ఈ సారి బిగ్ బాస్ షో రెడీ అవుతుందని  తెలిపింది. 

బిగ్ బాస్ లోగోలో (Biggboss Logo) ఉన్న రంగురంగుల చారలు ఎమోషన్స్‌ను సూచిస్తాయని, షో మొదలయ్యాక అవేంటో అందరికీ అర్థమవుతాయని షో నిర్వాహకులు తెలిపారు.

ఈ సారి 'బిగ్ బాస్ ఐ'ను  జనాల అభీష్టం మేరకు రూపకల్పన చేయడం జరిగిందన్నారు. అలాగే ఈసారి షోలోనూ మరిన్ని మార్పులు చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ సీజన్‌లో కూడా కింగ్ నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. 

మరి ఈ షోలో ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది? సెలబ్రిటీలు ఎవరెవరు పాల్గొనబోతున్నారు? లాంటి విషయాలను త్వరలోనే బిగ్‌బాస్ నిర్వాహకులు తెలియజేయనున్నారు. ఇప్పటి వరకు జరిగిన బిగ్‌బాస్ సీజన్ల విషయానికి వస్తే.. తొలి సీజన్‌లో శివ బాలాజి విజేతగా నిలవగా.. రెండవ సీజన్‌లో కౌశల్, మూడో సీజన్‌లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, నాలుగో సీజన్‌లో అభిజీత్ (Abhijeeth), ఐదో సీజన్‌లో వీజే సన్నీ (VJ Sunny) విజేతలుగా నిలిచారు. ఇక, బిగ్‌బాస్ ఓటీటీ షో విన్నర్‌గా ప్రముఖ హీరోయిన్ బింధుమాదవి నిలవడం విశేషం.

ప్రస్తుతం  అందరి కళ్లూ బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season6) మీదే ఉన్నాయి. ఈ సీజన్ ప్రోమోకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయినట్టు టాక్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'నాగార్జున' మీద స్పెషల్ ప్రోమో షూట్ చేయించినట్టు తెలుస్తోంది. ఇక హౌజ్‌‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న కంటెస్టెంట్ల అధికారిక జాబితా కూడా త్వరలోనే రిలీజ్ రానుంది. ఇప్పటికే కొందరు కంటెస్టెంట్లు ఫైనల్ అయినట్టు సమాచారం. 

ఈ సీజన్‌లో టాలీవుడ్ సీనియర్ నటుడు వడ్డే నవీన్, జబర్దస్త్ కమెడియన్ ఆది, అమరదీప్, చిత్ర రాయ్, దీపికా పిల్లి, నవ్య స్వామి, యాంకర్ వర్షిణి (Anchor Varshini), యాంకర్ ధనుష్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ఓటీటీ కంటెస్టెంట్ల నుంచి శివ, అనిల్, మిత్రా, అరియానా గ్లోరీ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఈసారి సాధారణ వ్యక్తులకు కూడా హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఇవ్వనున్నారు.  

Read More: Biggboss Season6: త్వరలో బిగ్ బాస్ సీజన్ 6.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!