బిగ్ బాస్ తెలుగు సీజన్6 (Biggboss Season 6) లో నామినేషన్ల రచ్చ.. కొట్టుకునేదాకా వెళ్లిన ఆది రెడ్డి, రోహిత్!

Updated on Oct 13, 2022 12:53 PM IST
రోహిత్, ఆదిరెడ్డి (Adi Reddy) మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్దం జరుగుతుంది. వీరిద్దరూ మీదమీదకి వెళ్లి మరీ అరుచుకున్నారు.
రోహిత్, ఆదిరెడ్డి (Adi Reddy) మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్దం జరుగుతుంది. వీరిద్దరూ మీదమీదకి వెళ్లి మరీ అరుచుకున్నారు.

తెలుగు బిగ్ బాస్ తెలుగు సీజన్6 (Biggboss Season 6) లో ఆరోవారం నామినేషన్స్ ప్రక్రియ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. హౌస్ లో ఎప్పటిలాగే సోమవారం నామినేషన్స్ పర్వం కొనసాగింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేట్ చేయాల్సిన ప్రతి ఇద్దరు ఇంటి సభ్యుల ముఖానికి ఫోమ్ రాసి సరైన కారణాలు చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించాడు. 

దీంతో ముందుగా కెప్టెన్ రేవంత్ (Singe Revanth) నామినేషన్స్ ప్రక్రియను మొదలు పెట్టారు. ఆయన సుదీప, బాలాదిత్యలను నామినేట్ చేయగా.. కాసేపు సుదీప,రేవంత్ మధ్య మాటల యుద్దం జరిగింది. ఇక, ఆ తర్వాత కీర్తి.. గీతూ, శ్రీసత్యలను నామినేట్ చేసింది. ఆ తర్వాత సుదీప..ఆది రెడ్డి, కీర్తిలను, ఆదిరెడ్డి.. మెరీనా, కీర్తిలను నామినేట్ చేశాడు.

మీరు మంచితనంతో ముందుకెళ్తున్నారు అంటూ ఆదిరెడ్డి (Adi Reddy) మెరీనాని నామినేట్ చేశాడు. ఈ పాయింట్ పై మెరీనా చాలాసేపు ఆర్గ్యూ చేసింది. ఆటలో నేను ముందే ఉన్నానని, ఆట అంటే బిగ్ బాస్ హౌస్ మొత్తం చక్కగా చూస్కోవడం కూడా అంటూ వాదించింది. హౌస్ మేట్స్ కాళ్లు నొప్పులు పుట్టే వరకూ ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నారు. ఆదిరెడ్డి అరిచి అరిచి అలసిపోయినా కూడా మెరీనా తిరిగి జవాబు చెప్తునే ఉంది. వీళ్ల ఆర్గ్యూమెంట్ తర్వాత రోహిత్ (Rohit) వచ్చి ఆదిరెడ్డిని నామినేట్ చేశాడు.

ఈ క్రమంలో రోహిత్, ఆదిరెడ్డి (Adi Reddy) మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్దం జరుగుతుంది. వీరిద్దరూ మీదమీదకి వెళ్లి మరీ అరుచుకున్నారు. మాటలతో మొదలైన వీరి లొల్లి కొట్టుకుంటారా అనే వరకు వెళ్లింది. అయితే ఒకరిపైకి మరోకరు దూసుకెళ్లినా.. మాకు సంబంధం లేదన్నట్లుగా మిగతా హౌస్ మేట్స్ నిల్చోవడం గమనార్హం. కేవలం వాసంతి (Vasanthi) మాత్రం ఆదిరెడ్డిని అక్కడి నుంచి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. 

Read More: Big Boss Season 6: బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన యాంకర్ ఆరోహీ రావు (Arohi Rao) గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!