Big Boss Season 6: బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన యాంకర్ ఆరోహీ రావు (Arohi Rao) గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

Updated on Oct 06, 2022 11:51 PM IST
బిగ్‌బాస్ (Big Boss Season 6) హౌజ్‌లో చలాకీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకున్న ఆరోహీ రావు (Arohi Rao)
బిగ్‌బాస్ (Big Boss Season 6) హౌజ్‌లో చలాకీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకున్న ఆరోహీ రావు (Arohi Rao)

బిగ్‌బాస్ (Big Boss Season 6) షోలో యాంకర్లకు కూడా పాల్గొనే ఛాన్స్ వస్తుంటుంది. ఇప్పటికే పలువురు యాంకర్లు ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశారు. ఈసారి ఆరోహీ రావు అలియాస్ అంజలి అనే యాంకర్‌ను ఈ అవకాశం వరించింది. ఆరోహి స్వస్థలం వరంగల్. 

ప్రముఖ తెలుగు వార్తా ఛానల్ టీవీ 9 యాంకర్‌గా పాపులారిటీ సాధించారు ఆరోహి (Arohi Rao). ఇస్మార్ట్ న్యూస్‌తో బాగా ఫేమస్ అయన ఆమె.. బాల్యం నుంచి కష్టాలే కేరాఫ్ అడ్రస్‌గా పెరిగారు. చిన్నప్పుడే అమ్మ చనిపోవడం, తండ్రి ఇంకో పెళ్లి చేసుకోవడంతో.. అమ్మమ్మ దగ్గర పెరిగారు ఆరోహి. స్వీయకృషితో ఆమె ఈస్థాయికి ఎదిగారు. 

హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ఆరోహి.. ఆ తర్వాత జర్నలిజం వైపు అడుగులు వేశారు. యాంకర్‌గా భీమ్స్ మీడియాలో కెరీర్‌ను మొదలుపెట్టారు. అనంతరం ఐ5 నెట్ వర్క్, పొలిటికల్ బెంచ్, స్టూడియో న్యూస్, స్టూడియో వన్ లాంటి ఛానెళ్లలో పని చేశారు. అయితే టీవీ9లో చేరిన తర్వాతే ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇస్మార్ట్ న్యూస్‌లో అంజలిగా ఆకట్టుకున్నారు. 

యాంకరింగ్‌లోనే కాదు.. ఆటలోనూ అదుర్స్

బిగ్‌బాస్ హౌజ్‌లో ఇదివరకు టీవీ 9 నుంచి యాంకర్ దేవీ నాగవల్లి వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి ఇదే ఛానెల్ నుంచి వచ్చిన ఆరోహి కూడా తన మార్క్ చూపించారు. హుషారుగా ఉంటూ వినోదాన్ని పంచుతూ వచ్చారు. ప్రధాన కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచి సత్తా చాటారు. ఆమె ఇలాగే ఆడితే గెలుపు అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. కానీ అనూహ్యంగా ఆరోహి ఈ వారం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. 

ఆరోహి ఎలిమినేషన్ అవ్వడంతో ఆర్జే సూర్య, కీర్తి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. బాగా ఆడండి అంటూ వాళ్లిద్దరితోపాటు హౌజ్‌మేట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి, ఆరోహి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నన్ని రోజులూ చాలా యాక్టివ్ గా ఉంటూ, గేమ్ బాగా ఆడుతూ వచ్చిన ఆరోహి.. హఠాత్తుగా ఎలిమినేట్ అవ్వడం ఆమె ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేస్తోంది.

Read more: Big Boss Season 6: కాంట్రవర్సీలకు దూరంగా ఉంటే గీతూ రాయల్ (Geetu Royal) విన్నయ్యే చాన్స్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!