త్వ‌ర‌లో బిగ్ బాస్ సీజ‌న్6 BiggBoss Season 6.. అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడంటే!

Updated on May 05, 2022 10:00 PM IST
బిగ్ బాస్ సీజ‌న్ 6 (Biggboss Season 6)
బిగ్ బాస్ సీజ‌న్ 6 (Biggboss Season 6)

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్ర‌స్తుతం ఈ షో డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో ప్ర‌సార‌మ‌వుతోంది. ఈసారి కథ సరికొత్తగా బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ప్రసారం అవుతున్న ఈ షో ప్రారంభ‌మైన కొత్త‌లో అంతగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ ప్రస్తుతం ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. అయితే, మరో మూడు వారాల్లో ఈ షోకి ఎండ్ కార్డ్ వేయబోతున్నారు. 

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ షో కి సంబంధించిన‌ ఒక వార్త సోషల్ మీడియాలో ప్ర‌స్తుతం చక్కర్లు కొడుతోంది. అదేంటంటే త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 6 ను మొదలుపెట్టాలని బిగ్ బాస్ షో నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 6 ని ప్రసారం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం అయిన‌ట్లు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. 

అయితే, ప్రతి ఏడాది జరిగే దానికంటే ఈ సీజన్ ను కాస్త ముందుగానే ప్రారంభించే అవకాశం ఉన్నట్లు స‌మాచారం. అంతేకాకుండా ఈసారి ప్రసారమయ్యే బిగ్ బాస్ షోలో పెద్ద పెద్ద సెలబ్రిటీలతో పాటు గా ఒకరు ఇద్దరు కామన్ పీపుల్ కి కూడా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. సీజన్ 2లో నూతన్ నాయుడు, సంజనా అన్నే, గణేష్ లాంటి వాళ్లు కామన్ మేన్ కోటాలో బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చారు.. మరి ఈ సీజన్‌లో ఎవరు రాబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.

బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ లో బిగ్ బాస్ నాన్ స్టాప్ గురించి ఏ విధంగా అయితే అధికారిక ప్రకటన ఇచ్చారో.. ఇప్పుడు సీజన్‌ 6కి సంబంధించి కూడా బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫినాలే స్టేజ్ మీద నుంచే అధికారిక ప్రకటన ఇస్తారనేది తాజా సమాచారం. కాగా, ఈ సీజ‌న్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.  

ఇతర భాషలతో పాటు తెలుగులో షో విజయవంతం అయ్యింది. అయితే, ఇతర రియాలిటీ షోలతో పోలిస్తే ఈ షో భారీగా క్రేజ్ ను తెచ్చుకుంది. ఇప్పటికే తెలుగులో 5 సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సీజ‌న్ కు సుమన్ టీవీ యాంకర్లు మంజూష (Anchor Manjusha), రోషన్ (Anchor Roshan) ఫిక్స్ అయినట్టుగా స‌మాచారం అందుతోంది. వీరితో పాటు ఈ మ‌ధ్య ఫేమ‌స్ అయిన‌ ప‌లువురు యూట్యూబ్ యాంకర్ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!