BiggBoss Nonstop: మే 21న బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే.. విజేత ఎవ‌రంటే?

Updated on May 22, 2022 03:42 PM IST
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో (Biggboss Nonstop Show)
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో (Biggboss Nonstop Show)

డిస్నీప్ల‌స్ హాట్ స్టార్‌లో ప్ర‌సార‌మ‌య్యే బిగ్ బాస్ నాన్ స్టాప్ (BiggBoss Nonstop) ఎట్టకేలకు చివరి అంకానికి చేరుకుంది. మరి కొద్ది రోజుల్లో ఫైనల్ ఫైట్ జరగబోతోంది.  దీంతో కంటెస్టెంట్ల మ‌ధ్య‌ ఉత్కంఠ పెరిగింది. 17 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభ‌మ‌యి 12 వారాలుగా కొన‌సాగుతున్న ఈ ఆట  ప్ర‌స్తుతం చివరి అంకానికి చేరుకుంది.

ఇక గత‌వారం జరిగిన ఎలిమినేషన్స్‌లో నటరాజ్ మాస్టర్ హౌస్‌ను వీడి వెళ్లిపోయారు. దీంతో ప్ర‌స్తుతం హౌస్‌లో ఏడుగురు మాత్రమే మిగిలారు. మిత్రా శర్మ, అనిల్ రాథోడ్, అరియానా గ్లోరి, బాబా భాస్కర్, యాంకర్ శివ, అఖిల్ సార్ధక్, బిందు మాధవి (Bindu Madhavi).. ఈ ఏడుగురు బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. అయితే ఈ షోకు సంబంధించి గ్రాండ్ ఫినాలే ఎప్పుడు జరగనుంది? గెలిచిన వారికి ఏమి ఇవ్వనున్నారు? అనే విషయాలు మ‌రో రెండు రోజుల్లో తెలియ‌నున్నాయి.

కాగా, బిగ్ బాస్ నాన్ స్టాప్ షో (BiggBoss Nonstop) గత 12 వారాలుగా నిరంత‌రాయంగా సాగుతోంది. ఈ వారంతో నాన్ స్టాప్ షోకి తెర పడనుంది. సాధారణంగా  ప్రతి సీజన్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే చివరి వారంలో ఉండేవారు. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అది కూడా జరగడం లేదు. అలాగే, బుధవారం రాత్రి వరకు మాత్రమే ఓటింగ్ లైన్స్ పనిచేస్తాయి. దీంతో, హౌస్‌లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్‌కి ఓట్లు పడతాయి.

కాబ‌ట్టి ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవారంతా ఫైనలిస్ట్‌ల కింద‌నే లెక్క.  ఇక ఫినాలేకి సంబంధించిన ఎపిసోడ్‌ను శనివారం నాడు చిత్రీకరించనున్నారు. దీనికి సంబంధించిన పనులు కూడా ఇప్ప‌టికే మొదలయ్యాయి.

ఇక‌, ఇప్ప‌టివ‌ర‌కు అందిన సమాచారం మేరకు గ్రాండ్ ఫినాలే, మే 21 న డిస్నీ+ హాట్‌స్టార్‌లో (Disney plus Hotstar) ప్రసారం కానున్న‌ట్లు తెలుస్తోంది. ఇక బిందుమాధవి, అఖిల్ సార్థక్ టాప్ కంటెస్టెంట్లుగా వార్తల్లో నిలుస్తున్నారు. కాబట్టి వీరిద్దరూ బిగ్ బాస్ నాన్ స్టాప్ ట్రోఫీ రేసులో ఉండేందుకు తమ అస్త్రాలను రెడీ చేసుకుంటున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!