(BiggBoss Nonstop): చివ‌రి వారంలో బిగ్ బాస్ నాన్ స్టాప్.. విన్న‌ర్ ఆమెనా? అత‌డా?

Updated on May 16, 2022 02:05 PM IST
బిందు మాధవి, అఖిల్ (Bindu Madhavi, Akhil Sartak)
బిందు మాధవి, అఖిల్ (Bindu Madhavi, Akhil Sartak)

బిగ్ బాస్ నాన్ స్టాప్ (BiggBoss Nonstop) ఆఖరి వారానికి వచ్చేసింది. దీంతో హౌస్ లో విన్నర్ ని డిసైడ్ చేసే సమయం వచ్చేసింది. ప్రస్తుతం నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో మొత్తం ఏడుగురు పోటీ ప‌డుతున్నారు. వారిలో అనిల్, బాబాభాస్కర్, అరియానా, మిత్రా శర్మా, బిందుమాధవి, అఖిల్, ఇంకా యాంకర్ శివలు ఉన్నారు. ఇందులో గత రెండు మూడు వారాలుగా, బిందు మాధవి, అఖిల్ ఇద్దరూ పోటీపోటీగా ఉన్న సంగతి తెలిసిందే. వీళ్లలో టైటిల్ ఎవరిని వరిస్తుంది అనేది ఆసక్తికరం. అయితే, ఇప్పుడు ఫైనల్స్ కాబట్టి, ఖచ్చితంగా సోషల్ మీడియాలో వార్ ఉంటుంది. గత వారాల్లో పోలిస్తే అఖిల్ కి ఇంకా బిందు మాధవికి మద్యలోనే టఫ్ ఫైట్ ఉంటుందని అనిపిస్తోంది. ప్రస్తుతం అందరూ అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ ని చూసే విన్నర్ ని డిసైడ్ అవుతున్నారు. దీంతో బిందుకి అఖిల్ కి మధ్య‌లోనే గట్టి ఫైట్ అనేది ఉండబోతోందని అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హౌస్ లో ఉన్న‌ సూపర్ సెవన్ మెంబర్స్ ని ఫినాలేకి ఎలా తీసుకొని వెళ్తారు. ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. హాట్ స్టార్ (Hotstar) అఫీషియల్ ఓటింగ్ లెక్కలు, అన‌ధికార లెక్క‌లు దాదాపుగా ఒకేలా ఉంటాయి. అయితే, వాటిని బిగ్ బాస్ మేనేజ్మెంట్ బయటకి చూపించదు. అంతేకాదు, ఎలిమినేషన్ తర్వాత కూడా ఏ కంటెస్టెంట్ కి ఎన్ని ఓట్లు వచ్చాయ‌నేది కూడా ఎక్కడా లీక్ చేయకుండా జాగ్రత్త పడతారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్, యూట్యూబ్ పోలింగ్స్ చూసిన తర్వాత ఎవరెవరు ఏయే పొజీషన్స్ లో ఉన్నారో ఇక్క‌డ చూద్దాం.. వెబ్ సైట్స్ పోలింగ్ సైట్స్ ని చూసినట్లయితే, అఖిల్ సార్ధక్ (Akhil Sartak) టాప్ ప్లేస్ లో ఉన్నాడు. దాదాపుగా 45శాతం వరకూ ఓటింగ్ ని ప్రభావితం చేశాడు. బిందు మాధవి సెకండ్ పొజీషన్ లో ఉంది. 38 శాతం వరకూ ఓటింగ్ ని సొంతం చేసుకుంది. కానీ, యూట్యూబ్ పోలింగ్స్ లో చూస్తే బిందు మాధవి టాప్ పొజీషన్ లో ఉంది. దాదాపుగా 50శాతం పైగానే ఓటింగ్ ని ప్రభావితం చేసింది. ఇక్క‌డ‌ అఖిల్ సార్ధక్ మాత్రం 30శాతం మాత్ర‌మే ఓటింగ్ తో ప్రభావితం చేయగలిగాడు. దీన్ని బట్టీ చూస్తుంటే వీళ్లిద్దరిలో విన్నర్ ని డిసైడ్ చేయడం కాస్త‌ కష్టంగానే ఉంది. 

ఇక, వీరి తర్వాతి స్థానాల్లో యాంకర్ శివ, అరియానా గ్లోరీ, మిత్రాశర్మా, బాబాభాస్కర్, చివ‌ర్లో అనిల్ ఉన్నారు. వీళ్లలో టైటిల్ రేస్ లో ఒక్కరూ కూడా లేరు. మొదటిరోజు ఓటింగ్ ప్రకారం.. అఖిల్-బింధుల (Bindu Madhavi) మధ్య‌నే గట్టి పోటీ నడుస్తోంది. యూట్యూబ్ లో బిగ్ బాస్ కి వ్యూవర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి, యూట్యూబ్ లో పెట్టే పోలింగ్స్ ప్రకారం.. ఈసారి బిందు మాధవి టైటిల్ ఎగరేసుకుపోయేలా కనిపిస్తోంది. అంతేకాదు, ఒక‌వేళ‌ బిందు మాధవి టైటిల్ గెలిస్తే తొలిసారి తెలుగు సీజన్ లో ఒక లేడీ బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. ట్రోఫీకి ఇంత దగ్గరగా వచ్చి క‌ప్పు గెలవకపోతే వచ్చే సీజన్ల‌ కష్టమే అని చెప్పాలి. మరి అఖిల్, బిందు ఇద్దరిలో ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌ర‌నేది ఆసక్తికరం.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!