బిగ్ బాస్ నాన్ స్టాప్ (BiggBoss Nonstop): బిందుమాధవికి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున!
తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ (BiggBoss Nonstop) రియాలిటీ షో ప్రారంభమయి 9వారాలు కావొస్తోంది. ఈ వారం వీకెండ్ లో లో హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ కి ముచ్చెమటలు పట్టించాడు. ఈ వారంలో కంటెస్టెంట్ల నామినేషన్స్ (Nominations) లో వచ్చిన పాయింట్స్ కి ప్రూఫ్స్ తో సహా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తొలుత బిందు మాధవి బాత్రూమ్ ఇష్యూ గురించి క్లారిటీ ఇస్తూ.. అసలు అఖిల్ ఏం అన్నాడు. నువ్వు ఏం ఊహించుకుంటున్నావ్ అంటూ క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా, ఈ విషయంలో అసలు శివ ఇన్వాల్ మెంట్ ఏంటి అంటూ నిలదీసి అడుగుతూ... కన్ఫెషన్ రూమ్ లో శివతో పర్సనల్ గా మాట్లాడాడు.
అనంతరం నాగార్జున (Akkineni Nagarjuna).. బిందుని పిలిచి వివరణ అడిగడంతో... బాత్రూమ్ నుంచి వచ్చేటపుడు అమ్మాయి కాబట్టి చెప్పట్లేదని అఖిల్ అన్నట్లుగా బిందు నామినేషన్స్ లో మాట్లాడింది. అంతేకాకుండా, ఆ తర్వాత నా విషయంలో స్టాండ్ తీస్కోలేదంటూ, శివకి ఈ విషయం తెలిసినా కూడా చెప్పడం లేదంటూ యాంకర్ శివతో మాట్లాడింది. శివతో ఫ్రెండ్షిప్ కూడా కట్ చేస్కోవడంతో నాగార్జున ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. అఖిల్ అసలు అక్కడ ఏం మాట్లాడాడో క్లారిటీ ఇచ్చేందుకు అఖిల్ ని కూడా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి.. బిందు, అఖిల్, యాంకర్ శివకు ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు నాగార్జున.
ఆ తర్వాత బిందు చేసిన వాదనలో అస్సలు మీనింగ్ లేదని నిరూపించాడు. ఆ తర్వాత పక్కకి రా అని అన్నట్లుగా మాట్లాడితే అది చాలా తప్పు అంటూ నాగార్జున క్లారిటీ ఇస్తూ ఓ వీడియో చూపించాడు. దీంతో హౌస్ మేట్స్ అందరికీ కూడా ఫుల్ క్లారిటీ వచ్చినట్లయింది. వీకండ్ ఎప్పుడొస్తుందా.. హోస్ట్ నాగార్జున ఏ పాయింట్స్ మాట్లాడతారో, వాటిని బట్టి బయట ప్రేక్షకులకి గేమ్ ఎలా వెళ్తోంది అనేది హౌస్ మేట్స్ అంచనా వేసుకుంటుంటారు. కానీ, ఈ సీజన్ లో నాగార్జున పీకే క్లాసులు హౌస్ మేట్స్ కి అర్ధం కావడం లేదు. కంటెస్టెంట్స్, ప్రేక్షకులు అనుకున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉంటోంది.
ఇదిలా ఉంటే.. వీకెండ్ లో నాగార్జున హౌస్ మేట్స్ కి కొన్ని నామినేషన్స్ కి పాయింట్స్ అందించినట్లుగానే కనిపిస్తోంది. బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేసి మరీ ఈసారి నాగార్జునతో ఇలా మాట్లాడించారా అన్నట్లు తెలుస్తోంది. ప్రోమోలో అయితే బిందుకి, అఖిల్ కి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. మరి పూర్తి ఎపిసోడ్ లో ఏం జరగబోతోందనేది చూడాలి.