బిగ్ బాస్(BiggBoss Nonstop) కంటెస్టెంట్ల‌కు మ‌రోసారి స‌ర్ ప్రైజ్.. టాప్5 లో ఉండేది ఎవరంటే?

Updated on May 01, 2022 08:28 PM IST
బిగ్ బాస్ నాన్‌స్టాప్ షో (Biggboss Nonstop Show)
బిగ్ బాస్ నాన్‌స్టాప్ షో (Biggboss Nonstop Show)

తెలుగు బిగ్ బాస్ నాన్‌స్టాప్ షో మ‌రి కొద్ది రోజుల్లో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో రెండు, మూడు రోజులుగా కంటెస్టెంట్స్ కి సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు బిగ్ బాస్. గ‌డిచిన వీక్ మొత్తం కంటెస్టెంట్ల‌ ఫ్యామిలీ మెంబ‌ర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఇంటి స‌భ్యుల్లో కొత్త‌ జోష్ వ‌చ్చింది. అయితే, ఈ వారం హౌస్ నుంచి ఆదివారం ఎపిసోడ్ లో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. 


ఇదిలా ఉంటే.. ఆదివారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ‌యింది. ఇందులో హౌస్ లోని కంటెస్టెంట్ల కోసం వారి స్నేహితుల‌ను మ‌రికొంత మందిని స్టేజిపై నాగార్జున ఆహ్వ‌నించారు. ఈ నేప‌థ్యంలో అఖిల్ కోసం సోహైల్ స్టేజ్ పైకి వ‌చ్చి.. త‌న తన ఫ్రెండ్ ను తెగ పొగిడేశాడు. ఈ క్ర‌మంలో మ‌ధ్య‌లో అరియానా లేచి నాకోసం కూడా కొంచెం చెప్ప‌రా అంటూ అడిగింది. దీంతో సోహైల్ తనదైన స్టయిల్ లో పంచ్ ఇచ్చాడు. నేను అన్నీ విన్నాలే, కూర్చో అన్నట్లుగా పంచ్‌ వేశాడు. 


అనంత‌రం యాంకర్ శివ కోసం గ‌తేడాది సీజ‌న్ ర‌న్న‌ర‌ప్ షణ్ముఖ్ స్టేజ్ పైకి వచ్చాడు. షణ్ముఖ్ ని చూసిన హోస్ట్ నాగార్జున 'బిగ్ బాస్ తరువాత ఎక్కడా కనిపించలేదేంటి..? బ్రేకప్ తో బిజీగా ఉన్నావా..?' అని ప్రశ్నించాడు. దీంతో ఏం మాట్లాడాలో అర్థం కాక షణ్ముఖ్ సైలెంట్ అయిపోయాడు. వెంట‌నే దొరికిందే ఛాన్స్‌ అనుకున్న అషూ.. దీప్తి సునయన ఎలా ఉందని అడుతూ షణ్నును మరింత ఉడికించింది. దీంతో షణ్ముఖ్ వెంట‌నే.. 'అషుకి నోటి దురద' అంటూ కౌంటర్ వేశాడు. 


తర్వాత అరియానా కోసం ఆమె సోదరి, దేవి నాగవల్లి వ‌చ్చారు. టైటిల్ ఎవ‌రు గెలుస్తార‌ని నాగార్జున‌ ప్ర‌శ్నించ‌గా మా అక్కే అంటూ ఫ‌స్ట్ ప్లేస్ లో పెట్టేసింది. అనంతరం సిరిని స్టేజ్ పై చూసి ఎమోషనల్ అయింది మిత్రాశర్మ. సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్.. మిత్రా మంచి ఫ్రెండ్స్. అనిల్ కోసం అతడి తండ్రి వ‌చ్చారు. 

అనిల్‌ తండ్రి మాట్లాడుతూ.. అతడు మాట్లాడకపోవడానికి కారణం నేనే, వాడిని అలా పెంచాను అంటూ గొప్పగా చెప్పాడు. దీంతో విషయం అర్థమైన నాగ్‌ మాట్లాడనివ్వకుండా పెంచారా? అని సెటైర్‌ వేశాడు. షో కోసం వచ్చిన గెస్ట్ లను టాప్ 5లో ఎవరు ఉంటారో చెప్పమని గేమ్ ఆడించారు నాగార్జున. ఈ గేమ్‌తో ఎవరు ఫినాలేలో చోటు దక్కించుకుంటారు? ఎవరికి టైటిల్‌ గెలిచే ఆస్కారం ఉందన్న విషయాలపై ఓ క్లారిటీ రానుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!