Siri Hanmath, Shanmukh Jaswanth: జాక్ పాట్ కొట్టేసిన సిరి హ‌న్మంతు, ష‌ణ్ముఖ్ జ‌స్వంత్!

Updated on May 15, 2022 07:53 PM IST
సిరి హ‌న్మంతు, ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ (Siri Hanmanthu, Shanmukh Jaswanth)
సిరి హ‌న్మంతు, ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ (Siri Hanmanthu, Shanmukh Jaswanth)

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు గ‌త ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ల‌యిన‌ సిరి, షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) ల గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌ క్కర్లేదు. వీరు గ‌తేడాది స్టార్ మా లో ప్ర‌సార‌మ‌యిన‌ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు యూట్యూబ్ వ‌ల్ల‌ బోలెడంత పాపులారిటీతో ఎంట్రీ ఇచ్చి వీరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పట‌కి మాత్రం.. అంతకు రెండింతలు నెగిటివిటీ మూటగ‌ట్టుకున్నారు. ఈ బిగ్ బాస్ షో వల్ల వీరిద్దరి ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. 

దీంతో సామాజిక మాధ్య‌మాల్లో వీరిపై జరిగిన ట్రోలింగ్స్ తో సిరి కొన్నిరోజులపాటు తీవ్రంగా డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఇక షణ్ముఖ్ జస్వంత్ Shanmukh Jaswanth విష‌యంలో అయితే.. అత‌ని ప్రియురాలు దీప్తి సునయ‌నా ఏకంగా బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత కొద్దికాలంపాటు వార్తల్లో నిలిచారు. కానీ సిరి, షణ్ముఖ్ లు వారికి ఉన్న టాలెంట్ తో నెగటివ్ గా కామెంట్స్ చేసే వారి నోరు మూయించారు. ఇదిలా ఉంటే సిరి హనుమంతు ఇటీవల బీఎఫ్ఎఫ్ అనే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా షణ్ముఖ్ జస్వంత్ కూడా ఏజెంట్ ఆనంద్ సంతోష్ అనే పేరుతో ఆహా ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ప్రకటించాడు. 

అంతేకాకుండా వీరిద్ద‌రూ ఆ వెబ్ సిరీస్ కు (Web Series) సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా తాజాగా విడుదల చేశారు. అయితే ఇన్వెస్టిగేషన్‌ త్వరలో ప్రారంభం అవుతుందని, కేస్‌ వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు ఆహా ట్వీట్ చేసింది. ఓ వైపు సిరి నటిస్తున్న బీఎఫ్‌ఎఫ్‌ వెబ్ సిరీస్, మ‌రోవైపు షణ్ముఖ్ నటిస్తున్న ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌ వెబ్ సిరీస్. ఈ రెండూ వెబ్ సిరీస్ లు కూడా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలోనే త్వ‌ర‌లో ప్రసారం కానున్నాయి. అయితే, మొత్తానికి వారు పంచుకున్న గుడ్‌న్యూస్‌ విని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Credits: Aha, Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!