కాళీకా దేవిగా (Bindu Madhavi) బిందుమాధ‌వి.. శూర్ప‌ణ‌ఖ అంటూ న‌ట‌రాజ్ మాస్ట‌ర్.. బిగ్ బాస్ లో బిగ్ ఫైట్!

Updated on May 11, 2022 10:27 PM IST
బిందుమాధ‌వి, న‌ట‌రాజ్ మాస్ట‌ర్ (Bindu Madhavi, Natraj Master)
బిందుమాధ‌వి, న‌ట‌రాజ్ మాస్ట‌ర్ (Bindu Madhavi, Natraj Master)

‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ (BiggBoss Nonstop) షోలో కంటెస్టెంట్ల మ‌ధ్య‌ 11వ వారం నామినేషన్స్ వాడివేడిగా సాగుతున్నాయి. అయితే, ప్ర‌తిసారి కంటే కూడా ఈసారి నామినేషన్స్ భిన్నంగా ఉన్నాయి. ప్రతివారం ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరు హౌస్ మేట్స్‌ను మాత్రమే నామినేట్ చేసేవారు. కానీ, ఈసారి మాత్రం ఒక్కొక్కరు ముగ్గురిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆర్డ‌ర్ చేశాడు. దీంతో ప్ర‌స్తుతం ‘బిగ్ బాస్’ హౌస్ హాట్ హాట్‌గా ఉంది. నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా బిందు.. నటరాజ్ మాస్ట‌ర్, అఖిల్‌, మిత్రా శ‌ర్మ‌ను నామినేట్ చేసింది. ఇక‌, నామినేష‌న్ సందర్భంగా అఖిల్, బిందుల మధ్య వాదన వాడీవేడిగా జరిగింది. ‘‘నేను ఒకటి మాట్లాడితే తాను ఇంకొకటి అన్ సింక్‌లో మాట్లాడుతుందని అఖిల్ అంటే.. ‘‘నీకు బుర్రలేదు కదా.. ఉంటే నీకు నేను మాట్లాడేది అర్ధమవుతుంది’’ అని బిందు కామెంట్ చేసింది. అనంత‌రం బిందు (Bindu Madhavi) నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేయ‌డంతో ఎప్పటిలాగానే ఆయన తన నోటికి పని చెప్పాడు. 

ఈ మేర‌కు న‌టరాజ్ మాస్ట‌ర్ కొన్ని వ్యాఖ్య‌లు చేశాడు. ‘‘బిందు వాళ్ల ఫాదర్ కి చెబుతున్నా.. ఈమెకి జ్ఞానాన్ని నేర్పించండి ప్లీజ్’’ అని అన్నాడు.  ‘‘నా తండ్రిని గురించి మాట్లాడొద్దు..’’ అని బిందు సీరియస్‌గానే చెప్పింది. దీంతో నటరాజ్ మాస్టర్ మరింత రెచ్చిపోయారు. ‘‘నేను నీలాగా దొంగమాటలు మాట్లాడను. నీ యాటిట్యూడ్ నువ్వు.. ఒక తెలుగమ్మాయికి ఉండాల్సిన లక్షణమే లేదు’’ అని పర్శనల్ గా ఎటాక్ చేశాడు. అదేవిధంగా ‘‘నేను చాలా స్ట్రాంగ్ గా ఆడాను.. నీలా నేను బెడ్‌పై కూర్చుని కాళ్లు ఊపుతూ కూర్చోలేదు’’ అని ఆమెపై ఫైర్ అయ్యాడు. దీంతో బిందు (Bindu Madhavi) న‌ట‌రాజ్ మాస్ట‌ర్ అతడి మీదకు వెళ్తూ ‘‘గో..’’ అని అంది. దీంతో మాస్టర్ కూడా ఆమె మీదమీదికి వెళ్లడంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది.

ఇక‌, త‌ర్వాతి రోజు మంగళవారం (Bindu Madhavi) బిందును నామినేట్ చేసే అవకాశం నటరాజ్ మాస్టర్‌కు లభిచింది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా డిస్నీ హాట్ స్టార్ విడుదల చేసింది. నటరాజ్.. బిందు, బాబా బాస్క‌ర్ మాస్టర్‌, అరియానాలను నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా సాధార‌ణంగానే బిందు, నటరాజ్‌ల మధ్య వాగ్వాదం నెలకొంది. ‘‘నెగటివిటీ కంప్లీట్‌గా ఉన్న ఒకే ఒక్క వ్య‌క్తివి నువ్వు మాత్రమే’’ అంటూ నటరాజ్ వ్యాఖ్యానించాడు. దీనికి కౌంట‌ర్ గా ‘‘నీ సైడ్ నుంచి ఇన్ని రోజులు ఏం వచ్చింది? పాజిటివిటీనా?’’ అని బిందు మాధవి ఎదురు ప్రశ్నించింది. దీంతో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ‘‘ఇప్పటివరకు బిందు చేసినవన్నీ దొంగ నామినేషన్లే’’ అని కెమెరాల వైపు తిరిగి నటరాజ్ చెప్పాడు. దీంతో బిందు కెమేరాలకు ఎందుకు చెబుతున్నారని అడిగితే.. ‘‘నీ ఫేస్ చూడలేక కెమేరాలకు చెబుతున్నా. నీ కళ్లు ఎక్కడ బయటకు వచ్చేస్తాయో, నరాలన్నీ ఎక్కడ పగిలిపోతాయో అని భయమేసి.. నేను అటు చూస్తున్నా. ‘‘శూర్పణఖ‌ నీ టైమ్ ఆసన్నమైంది. ఇదిగో లక్ష్మణ బాణం. ఆడియన్స్ నీ ముక్కు కోస్తారు’’ అని నటరాజ్ కామెంట్ చేశారు. దీంతో బిందు మాధవి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ దుర్గా మాత పోజులో నటరాజ్‌కు సమాధానం ఇచ్చింది. ఈ ప్రోమో చూసి నెటిజనులు నటరాజ్‌ను ట్రోల్ చేస్తున్నారు. కాస్త ఓవర్‌గా మాట్లాడుతున్నారని కౌంట‌ర్ వేస్తున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!