బిగ్ బాస్ నాన్ స్టాప్ (BiggBoss Nonstop) : ఫ్యామిలీ వీక్ లో అషు రెడ్డికి షాక్ ఇచ్చిన అఖిల్ త‌ల్లి

Updated on Apr 30, 2022 03:33 PM IST
అఖిల్ త‌ల్లి (Bigg Boss Contestant Akhil Sarthak Mother)
అఖిల్ త‌ల్లి (Bigg Boss Contestant Akhil Sarthak Mother)

దేశ వ్యాప్తంగా టెలివిజన్ చ‌రిత్ర‌లోనే బిగ్ బాస్ రియాలిటీ షో ఓ సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్న ఈ షోకు ప్రేక్షకుల నుంచి కూడా భారీ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. ఈ షో ప్రసారమయ్యే ఏడాదిలో ప్రతిసారీ ఆయా భాషల్లో బిగ్ బాస్ నెంబర్ వన్ స్థానంలో నిలుస్తూ వ‌స్తోంది. ఇక‌, తెలుగులోనైతే దీని ప్రభావం కాస్త గ‌ట్టిగానే ఉంది. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు సైతం వరుస పెట్టి సీజన్ల మీద సీజన్లను ప్రసారం చేస్తూ వస్తున్నారు. 

సాధారణంగా టెలివిజ‌న్ లో ప్ర‌సార‌మ‌య్యే ఏ షో అయినా రేటింగ్ కోసమే ప్రసారం అవుతుంద‌న్న సంగ‌తి తెలిసిందే. భారీ ఖర్చుతో రూపొందే బిగ్ బాస్ లాంటి షోల‌కు అది చాలా ముఖ్యం. దీంతో టీవీ ప్రేక్షకులు ఎటువంటి కంటెంట్‌ను ఎక్కువగా చూస్తారో.. నిర్వాహ‌కులు సైతం దానినే ప్రసారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. లవ్ ట్రాకులు.. ముద్దులు.. హగ్గులతో పాటు బోల్డు కంటెంట్‌పైనే నిర్వాహ‌కులు సైతం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగులో బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను ర‌న్ చేస్తున్నారు. తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టిన ఈ షో లో ప్ర‌స్తుతం కంటెస్టెంట్ల‌ ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే బిగ్ బాస్ ఇంటి సభ్యుడైన‌ అఖిల్ సార్థక్ తల్లి.. బోల్డ్ బ్యూటీ అషు రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. అషు రెడ్డి దగ్గరకు వెళ్లి 'అషు.. చక్కగా ఆడు. ఇక్కడకు ఆట ఆడడానికి మాత్రమే రావాలి. ఎమోషన్స్ పెట్టుకోడానికి కాదు. నువ్వు అందరితో ఎమోషనల్‌గా బాండ్ అవడానికే వచ్చావా? అలా చేస్తే ఇక్కడ నెగ్గుకురాలేరుస అంటూ ముఖం మీదే చెప్పి షాకిచ్చారు. దీంతో రియ‌లైజ్ అయిన‌ అషు రెడ్డి 'ఆమె నాతో డైరెక్టుగా అంతా చెప్పారు. ఇక నుంచి అన్నింటికీ దూరంగా ఉండాలి' అని డిసైడ్ అయింది.

అయితే, బిగ్ బాస్ హౌస్‌లోకి రెండోసారి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ త‌ల్లి.. వ‌చ్చే రావ‌డంతోనే సరదాగా కనిపించారు. తొలుత ఇంటి స‌భ్యులంద‌రికీ ఆమె స్వీట్లు తినిపించింది. అనంత‌రం కంటెస్టెంట్లు అందరి దగ్గరా వారి ప్లస్‌లు మైనస్‌లను ప్రస్థావించారు. ముఖ్యంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన‌ యాంకర్ శివను ఆమె ఓ ఆట ఆడుకున్నారు. త‌ర్వాత‌, బిందు మాధవితో ప్రేమగా మాట్లాడారు. షో ఫైన‌ల్ ఎపిసోడ్ అనంత‌రం తమ ఇంటికి రావాలని అఖిల్ త‌ల్లి ఆహ్వానించారు. కంటెస్టెంట్లందరూ బాగా ఆడుతున్నారని, ఇక్కడ ఎమోషన్స్ పెట్టుకోకూడదని వారికి సూచించారు. చివ‌రికి, తన కొడుకు అఖిల్ తో కూడా పదే పదే ఎమోషన్స్ గురించే మాట్లాడారు. 

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీ రాక మొదలవడంతో ఇంట్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఈ వారం ప్రసారమ‌యిన ఎపిసోడ్‌లో యాంకర్ శివ సోదరి, అషు రెడ్డి తల్లి, నటరాజ్ మాస్టర్ భార్య, కూతురు ఎంట్రీ ఇచ్చారు. దీంతో వాళ్ల రాకతో కంటెస్టెంట్లు ఫుల్ ఖుషీ అయిపోయారు. ముఖ్యంగా నటరాజ్ మాస్ట‌ర్ కూతురు లక్ష్య.. ఈ సీజన్ మొత్తానికే స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఇక‌, శుక్రవారం ఎపిసోడ్‌లో ముందుగా అరియానా గ్లోరీ స్నేహితుడు ఎంట్రీ ఇచ్చాడు. చివర్లో మిత్రా శర్మ కోసం ఒకరు ఎంటరయ్యారు. అయితే, ఈ సీజ‌న్ బిగ్ బాస్ లో ఈ ఎపిసోడ్ కొంత ఎమోషనల్‌గా సాగిందనే చెప్పుకోవ‌చ్చు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!