Satya: టాలీవుడ్‌లో మరో విషాదం.. గుండెపోటుతో యువ నటుడు సత్య మృతి!

Updated on Jun 04, 2022 10:19 AM IST
వరం, బ్యాచిలర్స్‌ సినిమాలో హీరోగా నటించిన సత్య (Satya)
వరం, బ్యాచిలర్స్‌ సినిమాలో హీరోగా నటించిన సత్య (Satya)

టాలీవుడ్‌లో శుక్రవారం మరో విషాదం చోటు చేసుకుంది. సింగర్‌‌ కేకే మరణించాడనే షాకింగ్ వార్త నుంచి కోలుకోముందే, మరో యువ హీరో సత్య మృతిచెందాడనే వార్త ఇండస్ట్రీని శోక సంద్రంలో ముంచేసింది. వరం, బ్యాచిలర్స్‌ సినిమాల్లో హీరోగా నటించిన సత్య (Satya) గుండెపోటుతో మరణించాడు.

కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యకు గురువారం సాయంత్రం సడెన్‌గా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను వెంటనే దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించాడని డాక్టర్లు ధ్రువీకరించారు.

కాగా, సత్య పూర్తి పేరు వి.రామసత్యనారాయణ. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో  పలువురు హీరోలకు స్నేహితుడి పాత్రలలో నటించిన సత్య.. 'వరం' సినిమాతో కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.

ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. తర్వాత 'బ్యాచిలర్స్‌' సినిమాతో మరోసారి హీరోగా మారాడు. అయితే ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. దీంతో అప్పటి నుంచి సినిమాలకు దూరమయ్యాడు సత్య.  బిజినెస్‌పై దృష్టి పెట్టాడు.

కరోనా సమయంలో తల్లిని, భార్యను పోగొట్టుకున్నాడు సత్య. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతూ అనారోగ్యం పాలయ్యాడు. గురువారం సాయంత్రం గుండెపోటుతో సత్య మరణించాడు.

సత్యకు ఎనిమిది సంవత్సరాల కూతురు ఉంది. సత్య (Satya) మరణించాడని తెలుసుకున్న బంధువులు, సెలబ్రిటీలు, శ్రేయోభిలాషులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు.

Read More: Singer KK : చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు ఆయనకు పాటే ప్రాణం.. గాయ‌కుడు కృష్ణకుమార్ కున్నత్ జీవితం ఆదర్శప్రాయం 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!