బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న సారా టెండూల్కర్ (Sara Tendulkar) ?

Updated on Apr 25, 2022 04:40 PM IST
బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న సారా టెండూల్కర్ (Sara Tendulkar)?
బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న సారా టెండూల్కర్ (Sara Tendulkar)?

లెజెండరీ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్‌‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన బాటలోనే నడుస్తూ సచిన్‌ కొడుకు అర్జున్ టెండూల్కర్‌‌ కూడా క్రికెటర్‌‌గా ఎంట్రీ ఇచ్చాడు. సోషల్‌ మీడియాలో కొంచెం యాక్టివ్‌గా ఉండే ఎవరికైనా సచిన్‌ కూతురు సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సచిన్ కూతురుగా స్టార్ కిడ్ హోదా దక్కించుకున్న సారా.. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు 1.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారంటే ఆమెకున్న క్రేజ్‌ ఎలాంటిదో అర్ధమవుతుంది.

సచిన్‌ భార్య అంజలి పిల్లల డాక్టర్‌‌. ఆమె ఇన్‌స్పిరేషన్‌తో సారా టెండూల్కర్ మెడిసిన్ చేసింది. యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ నుంచి డిగ్రీ పట్టా తీసుకుంది. మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్‌ వైపు అడుగుపెట్టిన సారా.. సొంతంగా డిజైన్ చేస్తున్న అంతర్జాతీయ క్లాతింగ్‌ను ప్రమోట్‌ చేస్తోంది. ఆజియో లక్సి ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంలో ఆమె క్లాతింగ్ బ్రాండ్స్ అందుబాటులో ఉంటున్నాయి. 24 ఏండ్ల సారా టెండూల్కర్.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందులో నిజమెంత అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. కొన్ని బ్రాండ్లను ప్రమోట్‌ చేస్తూనే..యాక్టింగ్‌లో కూడా పాఠాలు నేర్చుకుందని తెలుస్తోంది.

సారా టెండూల్కర్‌‌ (Sara Tendulkar),  షాహిద్‌ కపూర్ హీరోగా చేస్తున్న సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందని బీటౌన్‌ వర్గాల్లో ఇదివరకే విపరీతంగా ప్రచారం సాగింది. ఆ ప్రచారానికి పుల్‌స్టాప్‌ పెడుతూ తన కూతురు సారా సినిమాల్లో నటించడం లేదని సచిన్ క్లారిటీ ఇచ్చాడు. పుకార్లను నమ్మొద్దని చెప్పాడు. ప్రస్తుతం సారా టెండూల్కర్ దృష్టి అంతా చదువుపైనే ఉందని, చదువు తర్వాత ఏం చేయాలనేది తన ఇష్టమని తేల్చిచెప్పాడు. ఇక, తాజాగా వస్తున్న కామెంట్లు నిజమా లేక రూమర్లా అనేది తెలియాల్సి ఉంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!