Bigg Boss Telugu 6 : 'చలాకీ చంటి' (Chalaki Chanti) గురించి టాప్ టెన్ విశేషాలు !

Updated on Sep 23, 2022 06:56 PM IST
 'చలాకీ చంటి' (Chalaki Chanti) అనే కమెడియన్ చంటి బంటి, జబర్దస్త్, నా షో నా ఇష్టం లాంటి టీవీ కార్యక్రమాలతో బాగా పాపులర్ అయ్యారు.
'చలాకీ చంటి' (Chalaki Chanti) అనే కమెడియన్ చంటి బంటి, జబర్దస్త్, నా షో నా ఇష్టం లాంటి టీవీ కార్యక్రమాలతో బాగా పాపులర్ అయ్యారు.

చలాకీ చంటి (Chalaki Chanti) .. ఈటీవీలోని జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా చాలా పాపులర్ అయిన నటుడు. పలు రియాలిటీ షోలతో పాటు సినిమాలలో కూడా నటించారు. ఈయన కామెడీ టైమింగ్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవలే ఈయన బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో కూడా కంటెస్టంట్‌గా ఎంటర్ అయ్యారు. ఈ క్రమంలో చలాకీ చంటి గురించిన టాప్ టెన్ విశేషాలు మీకోసం

అసలు పేరు వినయ్ మోహన్

చలాకీ చంటి (Chalaki Chanti) అసలు పేరు వినయ్ మోహన్. తొలుత ఈయన టాటా ఇండికమ్ కంపెనీలో పనిచేసేవారు. తర్వాత, అనుకోకుండా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. 

మిమిక్రీ ఆరిస్టుగా కూడా గుర్తింపు 

టాంక్ బండ్ వద్ద బోటింగ్‌కు వచ్చే టూరిస్టులను ఎంటర్‌టైన్ చేయడానికి చంటి మిమిక్రీ పోగ్రామ్స్ చేసేవారు. తర్వాత ఈ టాలెంటే తనకు రేడియో మిర్చిలో ఆర్జేగా అవకాశం వచ్చేలా ఇచ్చింది. 

చంటి బంటి ద్వారా పాపులర్

'చంటి బంటి' అనే షోతో ఈ నటుడు ఇంకా పాపులర్ అయ్యారు. ఈ షో హిట్ అవ్వడం వల్లే ఆయన పేరు ఇండస్ట్రీలో 'చంటి'గా స్థిరపడిపోయింది. 

సినిమాలలో కూడా రాణించిన చంటి

చలాకీ చంటి నటించిన తొలి చిత్రం 'జల్లు'. ఈ చిత్రంతో పాటు దాదాపు 50 సినిమాలలో ఆయన నటించారు. అయితే చంటి కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రంగా 'భీమిలి కబడ్డీ జట్టు' (Bheemili Kabbadi Jattu) చిత్రాన్ని చెప్పుకోవచ్చు.

 

Chalaki Chanti

నా షో నా ఇష్టం

జబర్దస్త్‌కు కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చి 'నా షో నా ఇష్టం' (Naa Show Naa Ishtam) అనే షోని కూడా చంటి చేశారు. ఈ షోని కాలేజీ పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్వహించేవారు. ఇందులో ప్రాంక్ కాల్స్ ద్వారా సెలబ్రిటీలను ఆట పట్టించేవారు. 

బిగ్ బాస్ సీజన్ 6

చలాకీ చంటి ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Season 6) లో కంటెస్టంట్‌గా పాల్గొన్నారు. హౌస్‌లో తనదైన శైలిలో కామెడీని జనరేట్ చేస్తూ దూసుకుపోతున్నారు. 

సోషల్ మీడియా ద్వారా కూడా పాపులర్

చలాకీ చంటికి ఇన్ స్టాగ్రామ్‌లో లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అలాగే ఈయనకు స్వయంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. 

బిత్తిరి సత్తితో చేసిన కామెడీ ట్రాక్

చలాకీ చంటి (Chalaki Chanti) తన కెరీర్‌‌లో తెలంగాణ కమెడియన్ బిత్తిరి సత్తితో చేసిన ఓ ఇంటర్వ్యూ హైలెట్‌గా నిలిచింది. వీరిద్దరు ఓ కాకా హోట‌ల్‌లో పెట్టిన ముచ్చట్లు, మంచి కామెడీని జనరేట్ చేసి, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాయి. 

జబర్దస్త్‌కు కొన్నాళ్లు దూరమై.. ఆ తర్వాత మళ్లీ

చలాకీ చంటి జబర్దస్త్‌కు కొన్నాళ్లు దూరమయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఆ షోలో చేరారు. అయితే తనకు, షో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఉన్న అనుబంధం వల్లే అలా జరిగిందని చంటి పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. "నేను ఏదైనా సమస్యలో ఉంటే, ఆయనకు ముందే చెప్పి బ్రేక్ తీసుకొని వెళ్తాను. అందుకే నన్ను ఇప్పటికీ జబర్దస్త్‌లో గౌరవంగానే చూస్తారు" అని తెలిపారు చంటి. 

భావోద్వేగానికి గురైన చంటి

చలాకీ చంటి (Chalaki Chanti) తన విషాదభరితమైన జీవితం గురించి బిగ్ బాస్ సీజన్ 6 లో పంచుకున్నారు. "నేను ఆడవాళ్లకు చాలా దూరంగా ఉంటాను.  ఉదయం లేచేసరికే నా కూతుళ్లు ఇద్దరు స్కూలుకి వెళ్ళిపోతారు. వారితో కూడా దూరంగానే ఉంటాను. కానీ ఒక తండ్రిగా నా బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటాను. ఎందుకంటే అది నా సెంటిమెంట్. మా అమ్మ చిన్నప్పుడే నా కళ్ల ఎదుట చనిపోయింది. అందుకే నేను ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే, వారు నాకు దూరమవుతారేమో అనేది నా భయం. ఆ తర్వాత నేను మా అన్నయ్య, చాలా కష్టపడి పైకి వచ్చాం" అంటూ తన మనసులోని మాటలను బయట పెట్టాడు చంటి. 

ఇవండీ.. చలాకీ చంటి జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు

Read More: బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season 6) లో ఎంట్రీపై జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి స్పందన ఇదే..!

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!