ట్విట్టర్‌‌లో మిలియన్ల మంది ఫాలో అవుతున్న టాలీవుడ్‌ (Tollywood) టాప్‌10 స్టార్లు

ట్విట్టర్‌‌లో మిలియన్ల మంది ఫాలో అవుతున్న టాలీవుడ్‌ (Tollywood) స్టార్ల టాప్‌10 లిస్ట్‌లో ప్రభాస్‌ లేరు. ట్విట్టర్‌‌లో ఆయనకు అకౌంట్‌ లేదు

సినిమా హీరోలకు ఉండే క్రేజే వేరు. వాళ్లు ఏం చేసినా ట్రెండీగానే ఉంటుంది. కాస్ట్యూమ్స్‌, చెప్పల్స్, వాచీలు, బెల్ట్‌లు, కళ్లద్దాలు ఏం వేసుకున్నా స్టైల్‌గానే ఉంటాయి. అందుకే ఆయా హీరోలను ఫాలో అవుతుంటారు అభిమానులు.  

 ఒకప్పుడు హీరోలంటే ఎంత అభిమానం ఉన్నా సినిమాల వరకు మాత్రమే అది పరిమితమయ్యేది.హీరోల కుటుంబానికి లేదా వ్యక్తిగత విషయాలు తెలుసుకునే అవకాశాలు తక్కువగా ఉండేవి. ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ది చెందడం.. ఆయా హీరోలు కూడా తమ వ్యక్తిగత విషయాలను, సినిమా విశేషాలను అభిమానులతో పంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో అభిమాన హీరోలను ఫాలో చేస్తూ వారికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటున్నారు. మిలియన్ల మంది ఫాలోవర్లు (21-11-2022 వరకు ఉన్న లెక్కల ప్రకారం) ఉన్న టాలీవుడ్‌ (Tollywood) టాప్‌10 హీరోల వివరాలు పింక్‌విల్లా వ్యూయర్స్‌ కోసం..

మహేష్‌బాబు (MaheshBabu) :

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu)కు ఉన్న క్రేజ్ తెలిసిందే. సర్కారు వారి పాట సినిమాతో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకున్నారు ప్రిన్స్. కోట్ల మంది అభిమానులను అలరిస్తున్న మహేష్‌.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వ్యక్తిగత విషయాలతోపాటు సినిమాలకు సంబంధించిన అంశాలను ట్విట్టర్‌‌ ద్వారా వెల్లడిస్తుంటారు.

ట్విట్టర్‌‌లో మహేష్‌బాబును ఫాలో అవుతున్న వాళ్ల సంఖ్య 13 మిలియన్లు. ఏప్రిల్‌ 2010న ట్విట్టర్‌‌లో జాయినైన ప్రిన్స్‌ 30 మందిని ఫాలో అవుతున్నారు. అకౌంట్‌ @urstrulyMahesh పేరుతో ఉంది.
 

అల్లు అర్జున్ (Allu Arjun) :

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకున్న హీరో అల్లు అర్జున్ (Allu Arjun). డాన్స్‌, స్టైల్‌తో అభిమానులను అలరిస్తున్న బన్నీ.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తుంటారు.

ఏప్రిల్‌ 2015లో ట్విట్టర్‌‌లో జాయిన్ అయిన అల్లు అర్జున్‌ (Allu Arjun)ను 7.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆయన మాత్రం ఎవరినీ ఫాలో కావడం లేదు. @alluarjun పేరుతో అకౌంట్‌ ఉంది.

జూనియర్ ఎన్టీఆర్‌‌ (Junior NTR) :

మాస్, క్లాస్ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR). ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో పాన్‌ ఇండియా రేంజ్‌లో క్రేజ్‌ తెచ్చుకున్న ఆయన సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ మెరుస్తూ ఉంటారు.

సెప్టెంబర్‌‌, 2009లో ట్విట్టర్‌‌లో అకౌంట్‌ తెరిచిన తారక్‌ను 6.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఎన్టీఆర్‌‌ ఒక్కరినే ఫాలో అవుతున్నారు. @tarak9999 పేరుతో అకౌంట్ ఉంది.

నాగార్జున (Nagarjuna) :

ఇండస్ట్రీలోని సీనియర్ హీరోల్లో ఒకరైన నాగార్జున (Nagarjuna) ఇటీవల ‘ది ఘోస్ట్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. టాలీవుడ్‌ మన్మధుడుగా పేరు తెచ్చుకున్న నాగ్.. సినిమాలతోపాటు బిగ్‌బాస్‌ షో హోస్ట్‌గా చేస్తూ బిజీగా ఉన్నారు.

మార్చి 2010న ట్విట్టర్‌‌లో అకౌంట్‌ ఓపెన్ చేసిన నాగార్జునను 6.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. నాగ్ ఫాలో అవుతున్నది కేవలం ముగ్గురిని మాత్రమే. @iamnagarjuna పేరుతో అకౌంట్ ఉంది.

పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) :

పవర్‌‌స్టార్‌‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సినిమాలతోపాటు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు. మాస్‌లో విపరీతమైన ఇమేజ్‌ ఉన్న పవన్‌.. సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించరు.

ఆగస్టు 2014న ట్విట్టర్‌‌లో అకౌంట్ ఓపెన్‌ చేసిన పవన్‌కు 5.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన మాత్రం 277 మందిని ఫాలో అవుతున్నారు. పవన్ అకౌంట్‌ @PawanKalyan పేరుతో ఉంది.

నాని (Nani) :

సహజ నటనతో టాలీవుడ్‌లో స్టార్‌‌ ఇమేజ్‌ తెచ్చుకున్న హీరో నాని (Nani). అష్టా – చమ్మా సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన నాని.. మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. తన వ్యక్తిగత, సినిమా విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటారు.

ఫిబ్రవరి, 2012న ట్విట్టర్‌‌లో అకౌంట్ ఓపెన్ చేసిన నాని.. 4.5 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు. 36 మందిని ఆయన ఫాలో అవుతున్నారు. @NameisNani పేరుతో అకౌంట్ ఉంది.

అక్కినేని అఖిల్ (Akkineni Akhil) :

సిసింద్రీ సినిమాతో బాల నటుడిగా హిట్‌ సినిమాలో నటించారు అక్కినేని అఖిల్ (Akkineni Akhil). హీరోగా ఎంట్రీ ఇచ్చి యూత్‌లో క్రేజ్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఏజెంట్ సినిమాలో నటిస్తున్న అఖిల్‌.. తను జిమ్ చేస్తున్న ఫోటోలు, సినిమాకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు.

మే, 2010న ట్విట్టర్‌‌లో అకౌంట్ తెరిచిన అఖిల్ను 2.9 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. ఆయన మాత్రం 86 మందిని ఫాలో అవుతున్నారు. అఖిల్ అకౌంట్‌ @AkhilAkkineni8 పేరుతో ఉంది.

రాంచరణ్‌ (RamCharan) :

మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన హీరో రాంచరణ్ (RamCharan). తన నటన, స్టైల్‌తో అభిమానులను అలరిస్తున్న చరణ్.. సినిమాలతోపాటు తన వ్యక్తిగత విశేషాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో చరణ్‌ క్రేజ్‌ విపరీతంగా పెరిగింది. 

2020, మార్చిలో ట్విట్టర్‌ అకౌంట్‌ ఓపెన్ చేసిన చరణ్‌ను 2.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. చరణ్‌ మాత్రం కేవలం ఇద్దరినే ఫాలో అవుతున్నారు. @AlwaysRamCharan పేరుతో అకౌంట్ ఉంది.

నాగచైతన్య (NagaChaitanya) :

జోష్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు హీరో నాగచైతన్య (NagaChaitanya). తన నటనతో మంచి హీరోగా పేరు తెచ్చుకున్న చై.. స్టార్ హీరోయిన్‌ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాలతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఇక, ఏప్రిల్‌ 2010న ట్విట్టర్‌‌లో అకౌంట్‌ తెరిచిన నాగచైతన్య.. 2.6 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు. 125 మందిని ఆయన ఫాలో అవుతున్నారు. @chay_akkineni పేరుతో అకౌంట్ ఉంది.

 చిరంజీవి (Chiranjeevi) :

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి ఉండే అభిమానుల సంఖ్యను లెక్కించలేం. ఆయనపై వాళ్లు చూపించే అభిమానానికి అవధులు ఉండవు. చిరు కూడా వాళ్ల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. డ్యాన్స్‌, ఫైట్స్‌, డైలాగ్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి.. సోషల్‌ మీడియాలో కొంచెం తక్కువగానే కనిపించేవారు. అయితే ఇటీవల సోషల్‌ మీడియాలో కూడా స్పీడ్ పెంచారు చిరు.

మార్చి 2020లో ట్విట్టర్‌‌లో ఖాతా తెరిచిన చిరంజీవిని 1.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆయన మాత్రం ఎవరినీ ఫాలో కావడం లేదు. ఆయన ట్విట్టర్‌‌ అకౌంట్‌ @KChiruTweets పేరుతో ఉంది.  కాగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ట్విట్టర్‌‌లో అకౌంట్‌ లేదు.

Read More : Tollywood : తమిళంలోనూ కోట్లు కొల్లగొట్టిన టాప్‌10 తెలుగు సినిమాలు

You May Also Like These