Ari - My Name Is Nobody : అరి - అంతర్గత శత్రువుల వినాశనమేనా?.. అరి చిత్రం టాప్ 10 ఆసక్తికర విశేషాలు

Updated on Nov 09, 2022 11:14 PM IST
Ari - My Name Is Nobody : 'అరి - మై నేమ్ ఈజ్ నోబడీ'  చిత్రం ఓటీటీ హక్కుల కోసం పలు సంస్థలు పోటీ పడుతుండటం విశేషం.
Ari - My Name Is Nobody : 'అరి - మై నేమ్ ఈజ్ నోబడీ' చిత్రం ఓటీటీ హక్కుల కోసం పలు సంస్థలు పోటీ పడుతుండటం విశేషం.

Ari - My Name Is Nobody : 'అరి - మై నేమ్ ఈజ్ నోబడీ' సినిమా తెలుగులో తెరకెక్కుతున్న సింగిల్ లొకేషన్ చిత్రం. సరి కొత్త కథతో దర్శకుడు జయశంకర్ "అరి" సినిమాను చిత్రీకరించారు.  "అరి" సినిమా ఓటీటీ హక్కుల కోసం పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. చెడు అనేది కొంతవరకు  మంచికేనంటున్న "అరి" సినిమాపై టాప్ 10 ఆసక్తికర విశేషాలు పింక్ విల్లా ఫాలోవర్స్ కోసం.

Ari - My Name Is Nobody : 'అరి - మై నేమ్ ఈజ్ నోబడీ'  సినిమా ఓటీటీ హక్కుల కోసం పలు సంస్థలు పోటీ పడుతుండటం విశేషం.

Ari - My Name Is Nobody : 'అరి - మై నేమ్ ఈజ్ నోబడీ'  సినిమా ఓటీటీ హక్కుల కోసం పలు సంస్థలు పోటీ పడుతుండటం విశేషం.

అరి కథ 

అరి అంటే శత్రువు. అరి అనే పదం అరిషడ్వర్గాల నుంచి వచ్చింది. అరిషడ్వర్గాలు అంటే ఆరు అంతర్గత శత్రువులు. ఇవే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. అరిషడ్వర్గాలను జయిస్తే భగవంతుని తత్వం బోధపడుతుంది. మనిషికి నిజమైన శత్రువులైన అరిషడ్వర్గాలను "అరి" సినిమాలో దర్శకుడు ఎలా చూపించారనేదే కథ. 

దర్శకత్వం గురించి

"పేపర్ బాయ్" సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు జయశంకర్. "పేపర్" బాయ్ సినిమా ఓటీటీలో ఎన్నో మిలియన్ల వ్యూస్ పొందింది. జయశంకర్  దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రెండో సినిమా "అరి". ఈ సినిమాలో జయశంకర్ శ్రీ కృష్ణ భగవానుడి గురించి ఎవరూ చెప్పని కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

నటీనటులు 

అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), సాయికుమార్, శుభలేక సుధాకర్, సుమన్, ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాసరెడ్డి, చమ్మక్ చంద్ర, ఐడ్రీమ్ అంజలి, సురభి ప్రభావతి, మంగ్లీ ఈ సినిమాలో నటిస్తున్నారు. 

ఎవరెవరు ఏ పాత్రల్లో

దర్శకుడు జయశంకర్ అరిషడ్వర్గాలను వివిధ పాత్రలకు ఆపాదిస్తూ కొత్త కథను క్రియేట్ చేశారు. అనసూయ - ఈర్ష్య, సాయికుమార్ - అహంకారం, శుభలేక సుధాకర్ - అత్యాశ, సురభి ప్రభావతి - అనుబంధం, శ్రీకాంత్ అయ్యంగార్ - కోపం, వైవా హర్ష- కామం. 

వెండితెరపైకి మంగ్లీ

"అరి" సినిమాతోనే ప్రముఖ గాయకురాలు మంగ్లీ వెండితెరపై కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆమె ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. 

నిర్మాత ఎవరంటే

"పేపర్ బాయ్" సినిమాకు అమెరికా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన ఆర్వీ రెడ్డి ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. 

మ్యూజిక్

"అరి" చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. కాసర్ల శ్యామ్, వనమాలి లిరిక్స్ అందిస్తున్నారు. గాయకులు మంగ్లీ, షణ్ముక ప్రియ, దివ్యకుమార్ పాటలను ఆలపించారు.

సింగిల్ లొకేషన్ సినిమా

"అరి" సినిమాను సింగిల్ లొకేషన్ చిత్రంగా రూపొందిస్తున్నారు. టాలీవుడ్ సినిమాల్లో సింగిల్ లొకేషన్ సినిమాలు చాలా తక్కువగా రిలీజ్ అయ్యాయి. "అరి" సినిమాకు సంబంధించి దర్శకుడు ఈ ప్రయోగాన్ని చేయడం విశేషం. 

ఓటీటీ డీల్

"అరి" సినిమాకు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫ్లామ్ నెట్ ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. దాదాపు రూ. 10 కోట్లకు పైగానే డీల్ కుదిరిందని సమాచారం.  

రిలీజ్ ఎప్పుడంటే..

"అరి" సినిమాను డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ చేయనున్నారు.

Read More: EXCLUSIVE : ఓపిక, తెగువ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలం : డైరెక్టర్ వి. జయశంకర్ (V. Jayashankarr)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!