Single Film Stars : ఒకే ఒక్క చిత్రంతో "పాపులర్" అయిన టాప్ 10 హీరోయిన్స్

Updated on May 01, 2022 06:07 PM IST
మొద‌టి సినిమాతోనే ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన హీరోయిన్స్ ఉన్నారు. కొంద‌రు వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతుంటే.. మ‌రికొంద‌రు కొన్ని సినిమాల‌కే బ్రేక్ చెప్పేశారు.  త‌క్కువ సినిమాలే చేసినా మ‌రిచిపోలేని న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న వెండితెర లేడీ స్టార్స్ గురించి తెలుసుకుందాం.
మొద‌టి సినిమాతోనే ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన హీరోయిన్స్ ఉన్నారు. కొంద‌రు వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతుంటే.. మ‌రికొంద‌రు కొన్ని సినిమాల‌కే బ్రేక్ చెప్పేశారు. త‌క్కువ సినిమాలే చేసినా మ‌రిచిపోలేని న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న వెండితెర లేడీ స్టార్స్ గురించి తెలుసుకుందాం.

మొద‌టి సినిమాతోనే ఓవ‌ర్ నైట్ స్టార్స్ అయిన హీరోయిన్స్ ఉన్నారు. కొంద‌రు వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతుంటే.. మ‌రికొంద‌రు కొన్ని సినిమాల‌కే బ్రేక్ చెప్పేశారు.  త‌క్కువ సినిమాలే చేసినా మ‌రిచిపోలేని న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న వెండితెర లేడీ స్టార్స్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. 

ఒక్క సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ .. అతి త‌క్కువ టైంలోనే తెర వెన‌క్కు వెళ్లిపోయారు. కానీ వారు చేసిన క్యారెక్ట‌ర్లు ప్రేక్ష‌కుల హృదాయాల్లో చెర‌గ‌ని ముద్ర వేశాయి. 

రిచా పల్లాడ్  (Richa Pallod)

మొదటి సినిమా "నువ్వేకావాలి" తోనే ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు రిచా పల్లాడ్. అయితే ఈమెకు తెలుగులో మంచి అవ‌కాశాలు రాలేదు. ఆ తర్వాత చేసిన త‌మిళ్ సినిమా కూడా హిట్ కాలేదు.

అన్షు (Anshu)

అన్షు మన్మధుడు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. సెకండ్ హీరోయిన్ అయినా, ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచేశారు. ఆ త‌ర్వాత రాఘవేంద్ర సినిమాలో నటించి స్క్రీన్‌కు దూర‌మైపోయారు. 

అనురాధ మెహతా (Anuradha Mehta)

ఆర్య సినిమాతో యువ‌త మ‌నుసుకు ద‌గ్గ‌రైన న‌టి అనురాధ మెహ‌తా. ఆ త‌ర్వాత ఒక‌టి, రెండు సినిమాలు చేసినా స‌క్సెస్ అవ‌లేక‌పోయారు. 

నేహా శర్మ (Neha Sharma)

మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న‌ నటించిన తొలి కథానాయికగా..  మొద‌టి సినిమా ఛాన్స్ కొట్టేశారు నేహా శ‌ర్మ‌. చిరుత సినిమా త‌ర్వాత కుర్రాడు అనే సినిమాలో వరుణ్ సందేశ్ పక్కన న‌టించారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వైపుకు వెళ్లిన నేహీకు, ఆ తర్వాత పెద్ద‌గా సినిమా అవ‌కాశాలు రాలేదు. 

సారా జైన్ (Sara Jain)

మిస్ ఇండియా వ‌ర‌ల్డ్ టైటిల్ విజేత సారా జైన్. పంజా సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న న‌టించిన సారాకు .. ఆ త‌ర్వాత అవ‌కాశాలు రాలేదు. 

గౌరీ ముంజల్ (Gowri Munjal)

బ‌న్నీ సినిమాలో అల్లు అర్జున్‌తో క‌లిసి న‌టించారు గౌరీ ముంజ‌ల్. చేసింది కేవలం ఒక్క సినిమా అయినా, చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ  తర్వాత ఎలాంటి ప్రాజెక్టులు లేక‌పోవ‌డంతో సినిమాలకు బ్రేక్ చెప్పేశారు.

భాను శ్రీ మెహ్రా (Bhanu Shree Mehra)

వ‌రుడు సినిమాలో అల్లు అర్జున్ స‌ర‌స‌న భానుశ్రీ న‌టించారు. ఆ సినిమా హిట్ కాక‌పోవ‌డంతో భానుకు కూడా అవ‌కాశాలు లేకుండా పోయాయి.

షామిలి (Shamili)

చిన్నత‌నంలో చైల్డ్ ఆర్టిస్టుగా బేబీ షామిలీ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించారు. యుక్త వయసు వచ్చాక, ఈమె ఓయ్ సినిమా ద్వారా కథానాయికగా పరిశ్రమకు పరిచయమయ్యారు. కానీ  హీరోయిన్‌గా మాత్రం నిల‌దొక్కుకోలేక పోయారు. 

కార్తిక నయ్యర్ ( Karthika Nair)

అగ్ర న‌టి రాధ కూతురు కార్తిక న‌య్య‌ర్, జోష్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ఈమె ద‌మ్ము, రంగం మొదలైన సినిమాలు చేశారు. ఆ తర్వాత తన కెరీర్‌కు బ్రేక్ చెప్పేశారు. 

శియా గౌతమ్ (Sia Gautham)

పూరి జ‌గ‌న్నాథ్ ప‌రిచ‌యం చేసిన హీరోయిన్ శియా గౌత‌మ్. నేనింతే లాంటి హిట్ సినిమా త‌ర్వాత ఈమె చిన్న చిన్న పాత్ర‌ల్లో న‌టించినా .. అనుకున్నంత పాపుల‌ర్ అవ‌లేక‌పోయారు. 

పాయ‌ల్ గోష్ (Payal Ghosh)

"ప్ర‌యాణం" సినిమాలో మంచు మనోజ్ సరసన నటించిన ఈమె.. ఆ తర్వాత త‌న సినిమా ప్ర‌యాణానికి స్వస్తి పలికింది. 

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!