మ‌నాలీలో యాక్ష‌న్ సీన్స్ చేస్తున్న ఏజెంట్(Agent)

Updated on May 17, 2022 06:24 PM IST
ప్ర‌స్తుతం రెగ్యుల‌ర్ షూటింగ్ మ‌నాలీలో జ‌రుగుతుంది. 
ప్ర‌స్తుతం రెగ్యుల‌ర్ షూటింగ్ మ‌నాలీలో జ‌రుగుతుంది. 

అఖిల్ అక్కినేని(Akhil Akkineni) బ్యాచ్‌ల‌ర్ త‌ర్వాత డిఫెరెంట్ క‌థ‌లో తెర‌కెక్కిస్తున్న‌ సినిమా ఏజెంట్(Agent). ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డికి, అఖిల్‌కు మ‌ద్య గొడ‌వ‌లంటూ ఆ మ‌ధ్య‌ వార్త‌లు వ‌చ్చాయి. అఖిల్ సినిమాను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. ప్ర‌స్తుతం ఏజెంట్ రెగ్యుల‌ర్ షూటింగ్ మ‌నాలీలో జ‌రుగుతుంది..అఖిల్, సాక్షి విద్యా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న సినిమా ఏజెంట్. అఖిల్ స్పెష‌ల్ లుక్‌లో ఏజెంట్ సినిమాలో క‌నిపించ‌నున్నారు. ఏజెంట్ సినిమాకు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఏకే ఎంట‌ర్‌ట్రైన్మెంట్  ఈ సినిమాను నిర్మిస్తుంది. ముమ్ముట్టి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. 

ఏజెంట్ (Agent) కొంత షూటింగ్ పూర్తి చేసుకున్నా త‌ర్వాత ఓ నెగిటీవ్ టాక్ వైర‌ల్ అయింది. అఖిల్, సురేంద‌ర్ రెడ్డి (Surender Reddy) మ‌ధ్య విభేదాలు ఉన్నాయని. ఇక సురేంద‌ర్ రెడ్డి ఏజెంట్ సినిమాను డైరెక్ట్ చేయ‌ర‌ని గుస‌గుస‌లు వినిపించాయి. అయితే ప్ర‌స్తుతం ఏజెంట్ సినిమా మ‌నాలీలో రెగ్యుల‌ర్ షూట్ జ‌రుపుకుంటుంది. లేటెస్ట్ టెక్నాల‌జీ ఏజెంట్ సినిమా కోసం వాడుతున్నారు. అఖిల్ గెట‌ప్ ఈ సినిమాకు ప్ల‌స్ అంటున్నారు. ముమ్ముట్టి, అఖిల్ మ‌ధ్య సీన్స్  ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతాయ‌ని చిత్ర యూనిట్ తెలిపింది. సాక్షి, అఖిల్ కెమిస్ట్రీ బాగుంటుంద‌ని తెలిపింది. 

ఖిల్ గెట‌ప్ ఏజెంట్ (Agent)   సినిమాకు  ప్ల‌స్ అంటున్నారు

ఖిల్ గెట‌ప్ ఏజెంట్ (Agent)   సినిమాకు  ప్ల‌స్ అంటున్నారు

అనిల్ సుంకర ఏజెంట్ సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సహ నిర్మాతగా సురేందర్ రెడ్డి భార్య  ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రొడ్యూస‌ర్ల వ్య‌వ‌హారంలో తేడాలు రావ‌డంతో సురేంద‌ర్ రెడ్డి భార్య స‌హ నిర్మాత‌గా త‌ప్పుకున్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. కానీ అలాంటి వార్త‌ల్లో నిజం లేద‌ని  అనిల్ సుంకర తెలిపారు. 

ఏజెంట్ సినిమా ఆగస్టు నెలలో రిలీజ్ కాద‌నే ప్ర‌చాం కూడా జోరుగా సాగింది. నిర్మాత అనిల్ సుంక‌ర సోష‌ల్ మీడియా ద్వారా ఫేక్ వార్త‌ల‌ను న‌మ్మెద్దంటూ ట్వీట్ చేశారు. ఆగ‌స్టు నెల‌లోనే ఏజెంట్ రిలీజ్ ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చారు. పుకార్ల‌ను అభిమానులు న‌మ్మ‌కండ‌ని చెప్పారు. అనుకున్న షెడ్యూల్ ప్ర‌కార‌మే ఏజెంట్‌ సినిమాను విడుద‌ల చేస్తామ‌న్నారు. 

విశాఖ‌లో జ‌రిగిన షూటింగ్ త‌ర్వాత‌ ఏజెంట్ మ‌నాలీలో ఫైన‌ల్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆగ‌స్టులో ఏజెంట్ సినిమా రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నారు. అయితే లైగ‌ర్ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ ఆగ‌స్టులోనే ఉన్నా.. ఏజెంట్ ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. ఆగ‌స్టులోనే ఏజెంట్ (Agent) సినిమా రిలీజ్ చేసి తీరుతామ‌ని చిత్ర యూనిట్ అంటుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!