BLACK Official Trailer:"నా ఎనిమి నా కంటికి క‌నిపించ‌డు.. బ‌ట్ వాడితోనే పోరాడాలి" - బ్లాక్ ట్రైల‌ర్ అవుట్

Updated on May 22, 2022 10:56 PM IST
BLACK Official Trailer: ఆది సాయికుమార్ న‌టించిన బ్లాక్ మూవీ ట్రైల‌ర్ రిలీజ్
BLACK Official Trailer: ఆది సాయికుమార్ న‌టించిన బ్లాక్ మూవీ ట్రైల‌ర్ రిలీజ్

BLACK Official Trailer: టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ న‌టించిన బ్లాక్ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాను ద‌ర్శ‌కుడు జీబీ కృష్ణ తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ పాత్ర కొత్త‌గా ఉంటుంద‌నేది, ద‌ర్శ‌కుడు మొద‌టి నుంచి చెప్తున్న మాట‌.

మహంకాళి మూవీస్ బ్యానర్ పై మహంకాళి దివాకర్ 'బ్లాక్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఆది పోలీస్ ఆఫీస‌ర్‌గా ఈ సినిమాలో న‌టించారు. సిటీలో జ‌రిగే హ‌త్య‌లు, దొంగ‌త‌నాల కేసుల‌ను ఆది  ఎలా డీల్ చేస్తార‌నే క‌థ‌తో ఈ సినిమా తీశారు. "నా ఎనిమి నా కంటికి క‌నిపించ‌డు.. బ‌ట్ వాడితోనే పోరాడాలి" అంటూ ఆది చెప్పే డైలాగులు ట్రైల‌ర్‌లో అదిరిపోయాయి. 

'బ్లాక్' సినిమాలో ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) కు జోడిగా దర్శనా బానిక్ న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమని, సూర్య, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ మండా, పృథ్విరాజ్, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్‌లు య‌క్ట్ చేశారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. సతీష్ ముత్యాల డీవోపీగా,  అమర్ రెడ్డి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. మే 28 న ఆది న‌టించిన 'బ్లాక్' సినిమా విడుద‌ల కానుంది.  

'ప్రేమ కావాలి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు ఆది సాయికుమార్.ఈ సినిమా తర్వాత ఆయన అనేక చిత్రాలలో నటించారు. గాలిపటం, రఫ్, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, సుకుమారుడు, గరం, లవ్లీ, శమంతక మణి, బుర్ర కథ, శశి, అతిథిదేవోభవ, జోడి, చుట్టాలబ్బాయి లాంటి సినిమాలలో ఈయన నటించారు. నటుడు సాయికుమార్ కుమారుడైన ఆది.. తన తొలిచిత్రానికి ఉత్తమ తొలి చిత్ర కథానాయకుడిగా సైమా అవార్డు కూడా  అందుకున్నారు. ఇప్పటి వరకు ఈయన సినిమాలు దాదాపు యావరేజీగా ఆడిన రికార్డు ఉండగా, సరైన హిట్ కోసం ఇంకా తపిస్తూనే ఉన్నారు ఆది సాయికుమార్. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!