అల్లరి నరేష్ (Allari Naresh) ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా ప్రీ టీజర్‌‌ రిలీజ్‌ ఎప్పుడంటే?

Updated on Jun 27, 2022 06:51 PM IST
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా పోస్టర్
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా పోస్టర్

హిట్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వ‌రుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్‌‌టైన్ చేస్తుంటాడు అల్లరి నరేష్ (Allari Naresh). నరేష్‌ సినిమా వస్తున్నదంటే రెండు గంటలు హాయిగా నవ్వుకోవచ్చు అని ప్రేక్షకులు భావించేవారు. కొన్నాళ్లుగా నరేష్‌ సినిమాలు అన్నీ ఒకేలా ఉండడంతో ఆయన సినిమాలను థియేటర్లకు వెళ్లి చూడడం తగ్గించేశారు కూడా.

దాంతో నరేష్‌ రొటీన్‌కు భిన్నంగా ఉండే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఫుల్‌ లెంగ్త్‌ సీరియస్‌ క్యారెక్టర్‌‌ చేసి నాంది సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. కామెడీని పక్కనపెట్టి కమర్షియల్‌ సినిమా చేశాడు నరేష్. నరేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. అంతేకాదు ఆ సినిమాకు పలు అవార్డులు కూడా దక్కాయి.

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా పోస్టర్

ఎలక్షన్ ఆఫీసర్‌‌గా..

ప్రస్తుతం అల్లరి నరేష్‌ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా చేస్తున్నాడు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నరేష్‌ ఎలక్షన్ ఆఫీసర్‌‌గా కనిపించనున్నాడని సమాచారం. జీ స్టూడియోస్, హాస్య మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏఆర్‌‌ మోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

తాజాగా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాకు సంబంధించిన బిగ్‌ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రీ టీజర్‌‌ను మంగళవారం ఉదయం 10:36 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా, ఈ సినిమాతోపాటు ‘సభకు నమస్కారం’ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో కూడా అల్లరి నరేష్ (Allari Naresh) నటిస్తున్నారు.

Read More : Allari Naresh: ‘నాంది’ డైరెక్టర్‌‌తో అల్లరి నరేష్‌ మరో సినిమా.. ఫస్ట్‌ లుక్‌తోనే ఆసక్తి పెంచేసిన మేకర్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!