ధియేటర్లు, ఓటీటీల్లో (OTT) ఈ వారం కొత్త సినిమాలు

Updated on May 02, 2022 09:10 PM IST
థియేటర్లు, ఓటీటీల్లో (OTT)  రిలీజ్ కాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు
థియేటర్లు, ఓటీటీల్లో (OTT) రిలీజ్ కాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు

కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. దీంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. కరోనా కారణంగా థియేటర్లు మూతపడిన సమయంలో ఓటీటీల సందడి షూరూ అయ్యింది. థియేటర్లు ఓపెన్ అయ్యి సినిమాలు అందులోనే రిలీజ్ అవుతుండడంతో ఓటీటీలకు క్రేజ్ తగ్గుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఓటీటీల(OTT)  క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. థియేటర్‌‌లో హిట్‌, ప్లాప్ టాక్‌తో సంబంధం లేకుండా ఓటీటీలో రిలీజ్‌ అవుతున్న సినిమాలకు వ్యూస్‌ ఎక్కువగానే ఉంటున్నాయి. అంతేనా కొన్ని సినిమాలను థియేటర్‌‌లో చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించకున్నా..అవే సినిమాలకు ఓటీటీలో క్రేజ్‌ ఎక్కువగానే ఉంటోంది.

ప్రతి వారం సినిమాలు థియేటర్లలో ఎలా అయితే రిలీజ్ అవుతాయో వాటి కోసం సినీ ప్రేమికులు ఎలాగైతే ఎదురుచూస్తారో.. అదే విధంగా ఓటీటీల్లో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అనే విషయంపైనా ఆరాలు తీస్తున్నారు ప్రేక్షకులు. ఇక, ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో రిలీజ్‌ కాబోయే సినిమాలేంటో తెలుసుకుందాం.

జయమ్మ పంచాయతీ..

బుల్లితెర యాంకర్‌‌గా ఎప్పుడూ బిజీబిజీగా ఉండే యాంకర్‌‌ సుమ ఇప్పుడు వెండితెరపై సందడి చేయడానికి రెడీ అయ్యింది. సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘జయమ్మ పంచాయతీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పల్లెటూరి డ్రామాగా తెరకెక్కిన ‘జయమ్మ పంచాయతీ’ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు.

విశ్వక్‌సేన్ ‘అశోకవనంలో..’

యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌ హీరోగా రూపొందిన సినిమా ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ కూడా ఈ వారమే థియేటర్లలో సందడి చేయబోతోంది. విశ్వక్‌ పక్కన రుక్సార్ థిల్లాన్‌ హీరోయిన్‌గా నటించింది. విద్యాసాగర్‌‌ దర్శకత్వం వహించిన ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ సినిమాలో 33 ఏండ్లు వచ్చినా పెళ్లి కాని యువకుడి పాత్రలో విశ్వక్ కనిపించనున్నాడు

శ్రీ విష్ణు సినిమా కూడా..

శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘భళా తందనాన’ కూడా ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చైతన్య దంతులూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ట్రైలర్‌‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు..

కీర్తి సురేష్‌ నటించిన తమిళ సినిమా తెలుగులో చిన్ని పేరుతో ఓటీటీ (OTT) ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలవుతోంది. సెల్వ రాఘవన్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘చిన్ని’ సినిమా ట్రైలర్‌‌ ఇప్పటికే వైరల్ అయ్యింది. అరుణ్‌ మథేశ్వరం డైరెక్షన్‌ చేశాడు.

అమెజాన్‌ ప్రైమ్‌లో..

మే 5వ తేదీన ‌‌–  కన్నడ సినిమా మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్‌  

మే 6వ తేదీన – ద వైల్డ్స్‌ – వెబ్‌ సిరీస్‌ 2

నెట్‌ ఫ్లిక్స్‌లో..

మే 4వ తేదీన – రాధే శ్యామ్ హిందీ

మే 6వ తేదీన – థార్, ది సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్

జీ 5 లో..

మే 6వ తేదీన – ఝండ్‌

డిస్నీ హాట్‌ స్టార్‌‌లో..

మే 6వ తేదీన – హోమ్‌ శాంతి, స్టోరీస్‌ ఆఫ్‌ ది నెక్స్ట్‌ పేజ్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!