Brahmastra : 'బ్ర‌హ్మాస్త్రం' ప్రీ రిలీజ్ ప్రోమో విడుద‌ల‌.. అంచ‌నాలు మ‌రింత పెంచిన విజువ‌ల్స్

Updated on Sep 03, 2022 05:08 PM IST
Brahmastra :  అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన 'బ్ర‌హ్మాస్త్రం' తెలుగు వ‌ర్ష‌న్‌ను ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి స‌మ‌ర్పిస్తున్నారు. 
Brahmastra :  అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన 'బ్ర‌హ్మాస్త్రం' తెలుగు వ‌ర్ష‌న్‌ను ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి స‌మ‌ర్పిస్తున్నారు. 

Brahmastra : బాలీవుడ్ స్టార్ కపుల్ ర‌ణ్‌బీర్ క‌పూర్ (Ranbir Kapoor), అలియా భట్ న‌టించిన 'బ్ర‌హ్మాస్తం' మ‌రి కొన్ని రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ప్రీ రిలీజ్ ప్రోమోను విడుద‌ల చేశారు. విజువ‌ల్ వండ‌ర్‌గా ప్రోమో సాగింది. ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన 'బ్ర‌హ్మాస్త్రం' తెలుగు వ‌ర్ష‌న్‌ను ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి స‌మ‌ర్పిస్తున్నారు. 

ప్రోమో అదుర్స్

'బ్ర‌హ్మాస్త్రం' (Brahmastra) నుంచి విడుద‌లైన లేటెస్ట్ ప్రోమోలో అమితాబ్ బ‌చ్చ‌న్ డైలాగులు ఆస‌క్తిగా ఉన్నాయి. వెళ్లి ద‌హించేయ్ శివ అంటూ అమితాబ్ ప్ర‌పంచ వినాశ‌నాన్ని ఆపేందుకు ప్ర‌య‌త్నిస్తారు. నంది అస్త్రంతో నాగార్జున అత్యంత శ‌క్తిమంతుడిగా క‌నిపించారు. మౌనిరాయ్‌పై అస్త్రాల వీరులు ఎలా పోరాడుతారో విజువ‌ల్స్ చూస్తే తెలుస్తుంది. 3 డీలో ఈ సినిమా చూస్తే వండ‌ర్ అనిపించేలా ప్రోమో విజువ‌ల్స్ సాగాయి. 

అగ్ని అస్త్రం ర‌ణ‌బీర్ న‌టించిన శివ పాత్ర‌లో ఉంటుంది. శివను అగ్ని ద‌హించ‌లేదు. నంది అస్త్రం నాగార్జున‌లో ఉంటుంది. ఇక అంధ‌కారంలో ఉండి మౌని రాయ్ బ్ర‌హ్మాస్త్రం వ‌శ‌ప‌రుచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.

పురావస్తు శాఖ నిపుణుడు అజయ్‌ విశిష్ఠ్‌ పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రొఫెసర్‌ అరవింద్‌ చతుర్వేది పాత్రలో అమితాబ్‌ బచ్చన్ న‌టించారు. విల‌న్ దమయంతి పాత్ర‌లో మౌనీ రాయ్ న‌టించారు. బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కూడా ఓ సైంటిస్ట్ పాత్ర‌లో క‌నిపిస్తార‌ట‌. 

భారీ బ‌డ్జెట్ సినిమా

'బ్ర‌హ్మాస్త్రం' మూడు భాగాలుగా తెర‌కెక్కుతుంది. 'బ్ర‌హ్మాస్త్రం' మొద‌టి భాగం శివ పేరుతో  హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్‌ 9న విడుదల కానుంది. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించాయి. బ్ర‌హ్మాస్త్రం విడుద‌ల త‌రువాత ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. 

Read More : Brahmastra: ‘బ్రహ్మాస్త్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ర‌ద్దుపై అభిమానుల‌ను క్ష‌మాప‌ణలు కోరిన‌ ఎన్టీఆర్ (NTR)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!