‘సురాపానం* టీజర్ లాంచ్ చేసిన సాగర్‌‌ కె చంద్ర (Sagar K Chandra)

Updated on Apr 21, 2022 09:04 PM IST
సురాపానం టీజర్ లాంచ్
సురాపానం టీజర్ లాంచ్

అఖిల్‌ భవ్య క్రియేషన్స్ బ్యానర్‌‌పై సంపత్‌ కుమార్‌‌ నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా సురాపానం. కిక్‌ అండ్‌ ఫన్ అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమా టీజర్‌‌ను పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌తో భీమ్లానాయక్‌ వంటి సూపర్‌‌హిట్‌ సినిమా తీసిన దర్శకుడు సాగర్‌‌ కె చంద్ర గురువారం రిలీజ్ చేశారు. మంచి థ్రిల్‌తోపాటు వినోదాన్ని తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా అందిస్తుందని సాగర్‌‌ కె చంద్ర చెప్పారు. ‘సురాపానం’ సినిమా యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

ఫాంటసీతోపాటు కామెడీ ఎంటర్‌‌టైనర్‌‌గా సినిమాను తెరకెక్కించామని డైరెక్టర్‌‌ సంపత్‌ కుమార్‌‌ చెప్పారు. సెన్సార్‌‌ వర్క్స్‌ పూర్తి చేసుకుంటున్న ‘సురాపానం’ సినిమాను మే నెల చివరి వారంలో విడుదల చేస్తామన్నారు. సంపత్‌కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా నయన్ హీరోయిన్‌గా చేసింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!