ప్రముఖ దర్శకుడు మణి నాగరాజ్ (Mani Nagaraj) మృతి.. నివాళులర్పించిన సినీ ప్రముఖులు
ప్రముఖ దర్శకుడు మణి నాగరాజ్ (Mani Nagaraj) గురువారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన దర్శకుడు గౌతమ్ మీనన్ వద్ద కాక్క కాక్క చిత్రం నుంచి విన్నైతాండి వరుసవాయా చిత్రం వరకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అనంతరం పెన్సిల్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. కోలీవుడ్లో చాలామంది నటీనటులతో పనిచేసిన నాగరాజ్ ఈ సినిమాతో దర్శకుడిగా నిరూపించుకున్నారు. ఒక క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన పెన్సిల్ సినిమాలో ఆడపిల్లలపై జరిగే అకృత్యాలనూ ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. జె.వి. ప్రకాష్, శ్రీవిద్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేశారు. ఉత్తమమైన కథనం, స్క్రీన్ప్లే కారణంగా ఈ సినిమా తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది.
ప్రస్తుతం వాసువిన్ గర్ఫైణెగన్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కాగా గురువారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. నాగరాజ్ (Mani Nagaraj) ఆకస్మిక మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. గేయ రచయిత పార్వతి, ఎడిటర్ సురేష్ వంటి సినీ ప్రముఖులతోపాటు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.