సింగర్ సునీత (Sunitha) గురించి వచ్చిన వైరల్ న్యూస్ నిజమేనా?

Updated on Apr 23, 2022 10:06 PM IST
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్‌‌ చేసిన సింగర్ సునీత సునీత (Sunitha)
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్‌‌ చేసిన సింగర్ సునీత సునీత (Sunitha)

తన గాత్రంతోపాటు చూడచక్కని రూపంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు సింగర్‌‌ సునీత (Sunitha)  హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోనట్టుగా ఉండే సునీత.. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. అందమైన ఫోటోలతోపాటు తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంటారు సునీత . తాజాగా సోషల్‌ మీడియాలో అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు ఫోటోలను షేర్‌‌ చేసిన సునీత.. వాటికి బ్లెస్‌డ్‌ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. రెండు ఫోటోలు షేర్ చేసిన సునీత ఒక ఫోటోను మామిడి చెట్టు దగ్గర, మరో ఫోటోను పూల మొక్క వద్ద తీసుకున్నారు.

ఈ ఫోటోలను, బ్లెస్‌డ్‌ అనే క్యాప్షన్‌ చూసిన నెటిజన్లు, సునీత అభిమానులు ఆమె మరోసారి తల్లి కాబోతున్నారని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె నేరుగా ప్రకటించనప్పటికీ.. సునీత (Singer Sunitha) షేర్‌‌ చేసిన ఫోటోలు, క్యాప్షన్‌ ప్రకారం అభిమానులు అలాగే అర్ధం చేసుకుంటున్నారు. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సునీత జీవితాన్ని మరింత అందంగా మార్చుకున్నారని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఆమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కిరణ్ కుమార్‌‌ గోపరాజు అనే వ్యక్తిని 1997లో పెళ్లి చేసుకున్న సింగర్ సునీత (Singer Sunitha) 2017లో విడాకులు తీసుకుంది. వాళ్లిద్దరికీ ఒక కొడుకు, కూతురు కూడా ఉన్నారు. 2021లో సునీత మరో పెళ్లి చేసుకున్నారు. రామకృష్ణ వీరపనేని అనే బిజినెస్‌ మ్యాన్‌ను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కాగా, సునీత పిల్లలు పెళ్లికి పెద్దలుగా వ్యవహరిస్తూ ఆమెను ఒప్పించి పెళ్లి చేశారని తెలుస్తోంది.

రెండో పెళ్లిని సునీత  అట్టహాసంగా చేసుకున్నారు. 2021 జనవరిలో పెళ్లి చేసుకున్న సునీత, రామ్‌ల ప్రీ వెడ్డింగ్‌ పార్టీ డిసెంబర్‌‌ 26న ఘనంగా జరిగింది. గచ్చిబౌలిలోని బౌల్డర్‌‌హిల్స్​లో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్‌ పార్టీకి ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు మాత్రమే హాజరయ్యారు. రెండు కుటుంబాల మధ్యలోనే జరిగిన నిశ్చితార్ధ వేడుక ఫోటోలను కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన సునీత త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు పోస్ట్‌ చేశారు.

ప్లేబ్యాక్ సింగర్‌‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్​గా పేరుతెచ్చుకున్న సునీత ఇప్పటివరకు 9 నంది అవార్డులు, రెండు ఫిల్మ్​ఫేర్ అవార్డులు అందుకున్నారు. 2011లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం లతా మంగేష్కర్‌‌ అవార్డు సాధించారు. 1995లో గులాబి సినిమాలో పాటతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సునీత యాంకర్‌‌గా, హోస్ట్​గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 19 దేశాల్లో ప్రోగ్రాంలు చేసిన సునీత 1999 నుంచి దాదాపు ప్రతి సంవత్సరం యూఎస్‌ఏలో, యూకే, యూఏఈ, సింగపూర్, మలేషియా, యుగాండా, నైజీరియా, టాంజానియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, స్కాట్లండ్, ఐర్లాండ్, శ్రీలంక, థాయ్‌లాండ్, జపాన్, ఒమన్, బహ్రెయిన్‌, కతార్, మారిషస్‌లో లైవ్‌ పెర్ఫామెన్స్​లు ఇచ్చారు.

ఇక, సినిమా ఇండస్ట్రీలో రాణించడం మామూలు విషయం కాదు. అందులోనూ మహిళలు ఈ రంగంలో ఎదగాలంటే ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోక తప్పదు. సునీత రెండో పెళ్లి చేసుకోబోతోందనే విషయం తెలిసిన తర్వాత సోషల్‌ మీడియాలో ఆమెపై రకరకాల కామెంట్లు వచ్చాయి. అయితే వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్న సునీత .. జీవితంలో ముందుకు సాగాలంటే ఇటువంటి వాటిని ఎన్నింటినో ఎదుర్కోవలసి ఉంటుందని అంటున్నారు. వాటిని ధీటుగా ఎదుర్కొని నిలబడిన కారణంగానే తాను సక్సెస్ అయ్యానని సునీత (Singer Sunitha) తెలిపారు.

కాగా, సోషల్‌ మీడియాలో తాను పోస్ట్‌ చేసిన ఫోటోలు, క్యాప్షన్ ప్రకారం అభిమానులు అనుకుంటున్న విధంగా ఏమీ లేదని సింగర్ సునీత (Sunitha) క్లారిటీ ఇచ్చారు. ‘ఓరి దేవుడా! జనాలు ఎంత క్రేజీగా ఉన్నారు. మామిడి చెట్టుకు తొలిసారి కాయలు కాయడంతో వాటితో ఫోటో దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాను. దాన్ని ఇలా ప్రచారం చేస్తారా? ఊహాజనిత వార్తలు ప్రచారం చేయడం ఆపండి. దండం రా నాయనా’ అని ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!