రాక్షసుడు2 (Rakshasudu-2) సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్? సీక్వెల్ కాదంటూ ట్యాగ్‌

Updated on Aug 22, 2022 09:39 PM IST
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన రాక్షసుడు సినిమా సీక్వెల్‌ రాక్షసుడు2 (Rakhshasudu2) పోస్టర్‌‌ రిలీజ్ చేసిన మేకర్స్
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన రాక్షసుడు సినిమా సీక్వెల్‌ రాక్షసుడు2 (Rakhshasudu2) పోస్టర్‌‌ రిలీజ్ చేసిన మేకర్స్

‘అల్లుడు శ్రీను’ సినిమా త‌ర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌కు (Bellamkonda Srinivas) గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ‘రాక్షసుడు’. త‌మిళంలో సూప‌ర్ హిట్‌ అయిన ‘రాట్‌ససన్’ చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం 2019లో విడుద‌లై ఘ‌న విజయం సాధించింది. బెల్లంకొండ శ్రీనివాస్‌కు మొద‌టి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా రాక్షసుడు సినిమా నిలిచింది. ఈ సినిమాతో శ్రీనివాస్‌ న‌టుడిగా త‌న‌ని తాను ప్రూవ్ చేసుకున్నారు. రాక్షసుడు సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు.

ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శక‌త్వం వ‌హించిన రాక్షసుడు సినిమా దాదాపు రూ. 23 కోట్లు క‌లెక్ట్‌ చేసి  సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా స‌క్సెస్ మీట్‌లోనే సీక్వెల్ ఉంటుంద‌ని మేక‌ర్స్ ప్రక‌టించారు. ఇప్పటికే రాక్షసుడు2 (Rakshasudu-2) చిత్రం నుంచి విడుద‌లైన టైటిల్ పోస్టర్‌‌లు ప్రేక్షకుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. సోమ‌వారం దర్శకుడు ర‌మేష్ వ‌ర్మ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మేక‌ర్స్ కొత్త పోస్టర్‌ను విడుద‌ల చేశారు.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన రాక్షసుడు సినిమా సీక్వెల్‌ రాక్షసుడు2 (Rakhshasudu2) పోస్టర్‌‌ రిలీజ్ చేసిన మేకర్స్

సీక్వెల్‌ కాదంటూ ట్యాగ్‌ లైన్..

‘ఇట్స్ నాట్ ఎ సీక్వెల్’ అంటూ రాక్షసుడు-2 కొత్త టైటిల్ పోస్టర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్నారు. త్వర‌లోనే రాక్షసుడు2 సినిమా షూటింగ్ మొదలుకానుంది.

కాగా ఈ సినిమాలో న‌టీన‌టుల గురించి ఇప్పటివ‌ర‌కు ఎటువంటి ప్రకటన వెలువడలేదు. గ‌తంలో విజ‌య్ సేతుప‌తి ఈ సీక్వెల్‌లో న‌టిస్తుస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై మేకర్స్‌ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. హావిష్ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై స‌త్య నారాయ‌ణ కోనేరు రాక్షసుడు2 (Rakshasudu-2) సినిమాను నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సింగ‌ర్ సాగ‌ర్ డైలాగ్స్ రాస్తున్నారు. ఈ సినిమాలో కూడా బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) హీరోగా నటిస్తున్నరా లేదా అనేది త్వరలోనే తెలియనుంది.

Read More : Anupama Parameswaran: నేరుగా ఓటీటీలో విడుదల కానున్న అనుప‌మ ప‌ర‌మేశ్వరన్‌ ‘బటర్‌‌ఫ్లై’ సినిమా? త్వరలో ప్రకటన

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!