రణ్‌‌బీర్ కపూర్ (Ranbir Kapoor)తో ‘యానిమల్‌ (Animal)’ స్టార్ట్ చేసిన అర్జున్‌రెడ్డి (Arjun Reddy) డైరెక్టర్

Updated on Apr 22, 2022 05:55 PM IST
Ranbir Kapoor (రణ్‌బీర్ కపూర్) and Rashmika (రష్మిక) in Animal
Ranbir Kapoor (రణ్‌బీర్ కపూర్) and Rashmika (రష్మిక) in Animal

అర్జున్‌రెడ్డి (Arjun Reddy) సినిమాతో స్టార్‌‌ డైరెక్టర్‌‌ హోదా తెచ్చుకున్నాడు సందీప్ వంగా. ఆ సినిమాతో విజయ్‌ దేవరకొండను కూడా స్టార్‌‌ హీరోగా నిలబెట్టాడు. అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో తీసి సెన్సేషనల్ హిట్‌ అందుకున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌‌ రణ్‌ బీర్ కపూర్‌‌ (Ranbir Kapoor) సినిమా తీయబోతున్నట్టు కూడా ప్రకటించి వార్తల్లో నిలిచాడు. సినిమా పేరును ‘యానిమల్‌’ అని వెల్లడించి అంచనాలు పెంచేశాడు. అర్జున్‌రెడ్డిలో విజయ్‌ దేవరకొండను కొత్తగా చూపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న  సందీప్.. తమ అభిమాన హీరో రణ్‌వీర్‌‌ను ఎలా చూపించబోతున్నాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఆ సినిమాపై ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. యానిమల్‌ సినిమా షూటింగ్‌ను ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నట్టు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. హిమాలయాల్లో మొదటి షెడ్యూల్‌ స్టార్ట్ చేసినట్టు చెప్పింది. పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న ‘యానిమల్‌’ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో కూడా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. సరిలేరు నీకెవ్వరు, పుష్ప, ఆడాళ్లు మీకు జోహార్లు చిత్రాల విజయాలతో జోరు మీదున్న రష్మికా మందాన ‘యానిమల్‌’ సినిమాలో రణ్‌వీర్‌‌ పక్కన హీరోయిన్‌గా నటిస్తోంది. టీ సిరీస్,  భద్రకాళి పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగస్టు 22న రిలీజ్ చేయనున్నారు.  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!