Poornodaya Pictures: 30 ఇయ‌ర్స్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ రీ ఎంట్రీ

Updated on May 17, 2022 04:18 PM IST
పూర్ణోద‌య మూవీ క్రియేష‌న్స్ అధినేత ఏడిద నాగేశ్వ‌ర‌రావు మ‌నువ‌రాలు శ్రీజ నిర్మాత‌గా సినిమా తీస్తున్నారు
పూర్ణోద‌య మూవీ క్రియేష‌న్స్ అధినేత ఏడిద నాగేశ్వ‌ర‌రావు మ‌నువ‌రాలు శ్రీజ నిర్మాత‌గా సినిమా తీస్తున్నారు

Poornodaya Pictures: పూర్ణోద‌య పిక్చ‌ర్స్ అంటే ఒక‌ప్ప‌టి టాప్ మూవీ ప్రొడక్ష‌న్ హౌస్. ఎన్నో హిట్ సినిమాల‌ను అందించిన సంస్థ‌గా మంచి పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం మ‌ళ్లీ రీ ఎంట్రీతో పూర్ణోద‌య పిక్చ‌ర్స్ హిట్ సినిమాల‌ను అందించ‌నుంది.  

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆణిముత్యాల్లాంటి సినిమాలను పూర్ణోద‌య పిక్చర్స్ నిర్మాణ సంస్థ అందించింది. ఆల్ టైం హిట్‌గా నిలిచిన శంక‌రాభ‌ర‌ణం సినిమా ఈ సంస్థ నిర్మించిందే. సీతాకోక చిలుక‌, స్వ‌యం కృషి, సితార‌, సాగ‌ర సంగ‌మం వంటి సినిమాల‌తో త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 30 ఏళ్ల క్రితం వ‌ర‌కు సూప‌ర్ డూప‌ర్ హిట్ మూవీల‌ను నిర్మించింది. ప్ర‌స్తుతం మ‌ళ్లీ రి ఎంట్రీతో త‌న స‌త్తా చాట‌నుంది పూర్ణోద‌య పిక్చ‌ర్స్‌.

ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో (FirstDayFirstShow) టైటిల్‌తో పూర్ణోద‌య పిక్చ‌ర్స్ 30 ఏళ్ల త‌ర్వాత సినిమా నిర్మిస్తుంది. జాతిర‌త్నాలు మూవీ డైరెక్ట‌ర్ అనుదీప్ కేవీ ఇచ్చిన‌ ఓ కొత్త స్టోరిని ఈ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు ల‌క్ష్మీ నారాయ‌ణ పుత్త‌మ్‌శెట్టి, వంశీధ‌ర్ గౌడ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  శ్రీజ ఎంట‌ర్‌టైన్ మెంట్స్, మిత్ర‌వింద మూవీస్ కో ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో టైటిల్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. 

ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో (FirstDayFirstShow) టైటిల్‌తో పూర్ణోద‌య పిక్చ‌ర్స్ 30 ఏళ్ల త‌ర్వాత సినిమా నిర్మిస్తుంది

సినిమా - ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో(FirstDayFirstShow)
న‌టీన‌టులుః శ్రీ‌కాంత్ రెడ్డి, సంచిత బాసు, త‌నికెళ్ళ భ‌ర‌ణి, వెన్నెల కిశోర్‌, శ్రీ‌నివాస‌రెడ్డి, మ‌హేష్ ఆచంట‌, 
క‌థ - కె.వి. అనుదీప్‌,
ద‌ర్శక‌త్వం - వంశీధ‌ర గౌడ్‌, ల‌క్ష్మీనారాయ‌ణ పి.
స్క్రీన్క్‌ప్లే - కె.వి. అనుదీప్‌, వంశీధ‌ర గౌడ్‌, క‌ళ్యాణ్‌
నిర్మాత -శ్రీ‌జ ఏడిద‌
సంగీతం - ర‌థ‌న్‌

జాతీయ‌ స్థాయి అవార్దులు ద‌క్కించుకున్న పూర్ణోద‌య మూవీ క్రియేష‌న్స్ అధినేత ఏడిద నాగేశ్వ‌ర‌రావు మ‌నువ‌రాలు శ్రీజ నిర్మాత‌గా సినిమా తీస్తున్నారు. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో అనే టైటిల్‌తో సినిమా రిలీజ్ కానుంది. ప్రముఖ ద‌ర్శకుడు నాగ్ అశ్విన్ ఈ మూవీ లోగో రిలీజ్ చేశారు.

పూర్ణోద‌య మూవీ క్రియేష‌న్స్ అధినేత ఏడిద నాగేశ్వ‌ర‌రావు మ‌నువ‌రాలు శ్రీజ నిర్మాత‌గా సినిమా తీస్తున్నారు

ఏడిద నాగేశ్వ‌రావు నిర్మాణ సంస్థ నుంచి మ‌ళ్లీ సినిమాలు రావ‌డం సంతోషంగా ఉంద‌ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ అన్నారు. పూర్ణోద‌య మూవీ క్రియేష‌న్స్ ప్రొడ్యూస్ చేసిన  ఆప‌ద్భాంథ‌వుడు సినిమా అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని చెప్పారు. త‌న‌కు కూడా అవ‌కాశం వ‌చ్చే త‌ప్ప‌కుండా ఈ బ్యాన‌ర్‌లో సినిమా చేస్తాన‌న్నారు.  జాతిరత్నాలు కంటే అనుదీప్‌కు ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో సినిమా పెద్ద హిట్ ఇవ్వాల‌న్నారు నాగ్ అశ్విన్. ఫ్యామిలీ ఎంట‌ర్‌ట్రైన‌ర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంద‌న్నారు. 

పూర్ణోద‌య మూవీ క్రియేష‌న్స్ పాత త‌రంలో వ‌చ్చిన హిట్ సినిమాల్లానే ఇప్పుడు రావాల‌ని త‌న కూతురు శ్రీజ అనేద‌ని ఏడిద శ్రీరామ్ అన్నారు. అల్లు అర‌వింద్‌ని కలిసిన‌ప్పుడు హార్డ్ వ‌ర్క్ ఉంటే స‌క్సెస్ కొట్టొచ్చ‌ని శ్రీజ‌కు చెప్పార‌న్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింద‌ని.. త్వ‌ర‌లో రిలీజ్ చేస్తామ‌ని ఏడిద శ్రీరామ్ చెప్పారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌ట్రైన్ సినిమాలు త‌న బ్యాన‌ర్‌లో నిర్మిస్తున్నామ‌ని శ్రీజ తెలిపారు. 

Poornodaya Pictures:ద‌ర్శ‌కుడు వంశీ  ఎంబీబీఎస్ చ‌దివాడు. కానీ సినిమాల‌పై ఉన్న ఆస‌క్తితో ఈ రంగంలోకి వ‌చ్చాడ‌ని జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ అన్నారు. క‌థ ఉంటే డైరెక్ట్ చేస్తాన‌ని వంశీ త‌న‌ను అడిగాడ‌ని. .అప్పుడే ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో సినిమా క‌థ రాశాన‌న్నారు.  శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో వ‌స్తున్న ఈ సినిమా ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చ‌ని అనుదీప్ అన్నారు. ఫేమ‌స్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌,  టాలెంట్ మూవీ మేక‌ర్స్‌తో వ‌చ్చే ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!