Sitaramam Pre Release Event: 'సీతారామం' ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాన్ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కీలక వ్యాఖ్యలు

Published on Aug 05, 2022 11:48 AM IST

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం' (Sitaramam). అక్కినేని సుమంత్,స్టార్ డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్, తరుణ్‌ భాస్కర్‌, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) తెరకెక్కించగా, వైజయంతి మూవీస్ నిర్మించింది. 

'సీతారామం' (Sitaramam Release Date) శుక్రవారం (ఆగస్టు 5) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

'సీతారామం' ప్రీ రిలీజ్ ఈవెంట్ (Sitaramam Pre Release Event) లో ప్రభాస్ మాట్లాడుతూ.. "డైరెక్టర్ బ్యూటిఫుల్ మూవీస్ తీస్తారు. ఇప్పుడే ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. చాలా బాగా కట్ చేశారు. లవ్ స్టోరీ, యుద్ధం కలిపి తీయడం అంత ఈజీ కాదు. ఈ సినిమాని రష్యా, కశ్మీర్ అంత చలిలో కూడా చాలా కష్టపడి తీశారు. 50ఏళ్ల నుంచి సినిమాలు నిర్మించడం అమటే మాములు విషయం కాదు. దత్ గారి లాంటి నిర్మాత ఉండటం తెలుగు సినిమా అదృష్టం. కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూడాలి, అలాంటి సినిమా ఇది" అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభాస్ ఇంకా మాట్లాడుతూ..  ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్ళడం మనేస్తామా? ఇది కూడా అంతే. మా సినిమా ఫీల్డ్ కి థియేటరే గుడి. అందరూ థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి. అలాగే ఈ సినిమాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక (Rashmika Mandanna) కూడా ఉంది" అని పేర్కొన్నారు.

దేశంలో ఉన్న హ్యాండ్సమ్‌ హీరో, స్టార్‌ దుల్కర్‌. అందరూ దుల్కర్, మృణాల్‌ నటన గురించి చెబుతున్నారు. చూడాలనే ఆసక్తి కలుగుతోంది. ఇందులో ప్రేమకథే కాదు, యుద్ధంతోపాటు ఇతర అంశాలూ ఉన్నాయని చెప్పారు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin). రష్యాలో చిత్రీకరించిన తెలుగు సినిమా ఇదేనేమో నాకు తెలిసి. దర్శకుడు హను రాఘవపూడి సినిమాలు చూశా. కవితాత్మకంగా తీస్తుంటారు. ఇందులో సుమంత్‌ చేశారంటే ఆయన పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది అని తెలిపారు నాగ్ అశ్విన్.

Read More: 'సలార్' (Salaar) షూటింగ్‌లో ప్రభాస్ కాలికి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్ !