Dulquer Salman: 'సీతారామం' (Sitaramam) చాలా ఒరిజినల్ కథ... క్లాసిక్ మూవీ.. దుల్కర్ సల్మాన్ కీలక వ్యాఖ్యలు!

Published on Aug 05, 2022 12:57 PM IST

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం' (Sitaramam). అక్కినేని సుమంత్,స్టార్ డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్, తరుణ్‌ భాస్కర్‌, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) తెరకెక్కించగా, వైజయంతి మూవీస్ నిర్మించింది. 

'సీతారామం' (Sitaramam Release Date) శుక్రవారం (ఆగస్టు 5) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. "ముందుగా ఈవెంట్ కు వచ్చిన ప్రభాస్ (Prabhas) గారికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన ఒక గ్లోబల్ డార్లింగ్ స్టార్. నేను 'ప్రాజెక్ట్ K' (Project K) లో కొన్ని సెట్స్ చూశాను. తప్పకుండా ఆ సినిమా ఇండియన్ సినిమాను చేంజ్ చేస్తుంది అని నమ్మకంగా చెప్పగలను. ఆ సినిమా కోసం మీ అందరిలాగే నేను కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని అన్నారు.  

దుల్కర్‌ సల్మాన్‌ 'సీతారామం' (Sitaramam) సినిమా గురించి మాట్లాడుతూ.. సీతారామం కథతో నేను చాలా కాలం పాటు ట్రావెల్ అయ్యాను. 'సీతారామం' చాలా ఒరిజినల్ కథ. రియల్లీ క్లాసిక్ మూవీ. చాలా అరుదైన కథ. ఇలాంటి సినిమా ఇప్పటి వరకూ ఎక్కడా రాలేదు. నాకు స్క్రీన్ ప్లే చాలా నచ్చింది. ఊహాతీతంగా ఉంటుంది. మీరు ట్రైలర్ లో చూసింది కేవలం గ్లింప్స్ మాత్రమే. 'సీతారామం' అద్భుతాన్ని వెండితెరపై చూడాల్సిందేనని తెలిపారు. 

ఇక, వైజయంతి మూవీస్ లో ఉన్న అందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా నిర్మాత స్వప్న దత్ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. నిజంగా ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడ్డారు. అందరూ, నన్ను నేను చాలా స్మార్ట్ అంటూ ఉంటాను కానీ అశ్వినీ దత్ గారు మోస్ట్ చార్మ్ పర్సన్. ఆయన ఎల్లప్పుడూ తన నవ్వుతూనే ఒక మంచి సపోర్ట్ ఇస్తారు" అని పేర్కొన్నారు. 

Read More: "కథ విని భయపడిపోయి.. నో చెప్పాను"... 'సీతారామం' ప్రమోషన్లలో రష్మిక మందన్న(Rashmika)!