Prabhas: 'సీతారామం' ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ.. ఫ్యాన్స్ ఖుషీ!

Published on Aug 05, 2022 12:26 PM IST

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ (Bahubali) చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas). ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో ఈ హీరో వరుసగా పాన్‌ ఇండియా చిత్రాలనే ఎంచుకుంటూ దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంటున్నాడు. బాహుబలి 2 (ది కంక్లూజన్) సినిమా తర్వాత పాన్‌ ఇండియా మార్కెట్‌లో విడుదలైన 'సాహో', 'రాధేశ్యామ్‌' (Radheshyam) చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా..  ప్రభాస్‌ ఇమేజ్‌ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు.

ప్రస్తుతం ప్రభాస్ 'ఆదిపురష్‌', 'సలార్‌', 'ప్రాజెక్ట్‌ కె' (Project K) వంటి చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. బుధవారం జరిగిన ‘సీతారామం’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

‘సీతారామం’ చిత్రంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman), మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించారు. అక్కినేని సుమంత్, డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్, తరుణ్‌ భాస్కర్‌, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. వైజయంతీ సమర్పణలో అశ్వినీదత్‌ నిర్మించిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. 

ఇదిలా ఉంటే.. ‘సీతారామం’ప్రీరిలీజ్‌ (Siataramam Pre Release Event) ఈవెంట్‌ లో ప్రభాస్‌ ఇచ్చిన ఎంట్రీ గ్రాండ్‌గా ఆకట్టుకునేలా ఉంది. డార్లింగ్ ఎంట్రీతో విజిల్స్‌, అరుపులతో స్టేడియం హోరెత్తింది. ట్రిమ్‌డ్ గడ్డం,మీసాలతో ప్రభాస్‌ దర్శనమిచ్చాడు. బ్లాక్ టీ షర్ట్, డెనిమ్ జీన్స్‌లో స్టైలిష్‌ లుక్ లో కనిపించాడు ప్రభాస్‌. అంతే కాదు బరువు తగ్గి చాలా స్లిమ్‌గా అయ్యాడు.

ఈ నేపథ్యంలో.. ప్రభాస్ ధరించిన టీషర్ట్ (Prabhas T-Shirt) ధర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీన్ని డిజైన్ చేసింది 'డాల్స్ గబ్బానా' బ్రాండ్ కావడం విశేషం. కాగా, డార్లింగ్ ధరించిన .. ఈ టీషర్ట్ ధర అక్షరాలా 20 వేల రూపాయలని తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వైరల్ అవుతున్నాయి. 

ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల హోస్ట్ చేస్తున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'జాతిరత్నాలు' డైరెక్టర్‌ అనుదీప్‌, తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్‌, హను రాఘవపూడి, సుమంత్, అశ్వినీదత్‌, దుల్కర్ సల్మాన్‌, మృణాల్ ఠాకూర్‌, రష్మిక మందన్నా (Rashmika Mandanna) పాల్గొన్నారు.

Read More: 'సీతారామం' ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాన్ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కీలక వ్యాఖ్యలు