రజినీ (Rajinikanth) సినిమాలో విలన్‌గా నీలాంబరి

Updated on Apr 28, 2022 09:34 PM IST
నరసింహ సినిమాలో రజినీ(Rajinikanth), రమ్యకృష్ణ
నరసింహ సినిమాలో రజినీ(Rajinikanth), రమ్యకృష్ణ

సూపర్‌‌స్టార్‌‌ రజినీకాంత్ (Rajinikanth) పేరు చెబితేనే ఫ్యాన్స్​కు పూనకాలు వస్తాయి. ఆయన స్టైల్, యాక్టింగ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. అందుకే ఎన్నో ఏండ్లుగా రజినీ ఇండస్ట్రీలో నంబర్‌‌వన్‌గా కొనసాగుతున్నారు. రజినీకాంత్‌ నటించిన నరసింహ’ సినిమా ఎంత పెద్ద సూపర్‌‌హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాలో నీలాంబరి పాత్ర పోషించిన రమ్యకృష్ణకు రజినీకి మించి మార్కులు పడ్డాయి. నరసింహలో రమ్యకృష్ణ నటన, హావభావాలు అన్నీ ఓ రేంజ్ అనే చెప్పుకోవాలి.

ఆ సినిమా రిలీజ్‌ అయ్యి సుమారుగా 23 సంవత్సరాలు పూర్తయ్యింది. అయినా ఇప్పటికీ నరసింహ సినిమా పేరు చెబితే అందులోని నీలాంబరి పాత్ర అందరికీ ఠక్కున గుర్తుకు వస్తుందంటే ఆ పాత్ర ఎంతగా పాపులర్ అయ్యిందో తెలుస్తుంది.

ఆ సినిమా తర్వాత రమ్యకృష్ణను చాలా మంది నీలాంబరిగానే గుర్తుపెట్టుకున్నారంటే అతిశయోక్తి కాదు. నరసింహ సీక్వెల్‌ వస్తుందని అందరూ చాలా కాలం ఎదురుచూశారు. అడపాదడపా నరసింహ సీక్వెల్‌పై పలు ప్రచారాలు కూడా జరిగాయి. అయినప్పటికీ దానికి సంబంధించిన ఎటువంటి అప్‌డేట్‌ రాలేదు. ఇప్పుడు తాజాగా రజినీ కాంత్ హీరోగా నటించబోయే సినిమాలో రమ్యకృష్ణ విలన్‌గా చేస్తోందనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. సన్‌ పిక్చర్స్‌ నిర్మించబోయే ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం. స్క్రిప్ట్‌ పనులు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనున్న ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్, ప్రియాంక అరుల్‌ మోహన్ కీలకపాత్రలు చేయబోతున్నారు.

ఈ సినిమాలో విలన్‌గా చేయాలని రమ్యకృష్ణను కోరగా.. కథ నచ్చడంతో ఆమె కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికార ప్రకటన రాకున్నా.. త్వరలోనే వచ్చే చాన్స్‌ ఉందని సమాచారం.

ఇక రజినీ కాంత్‌ హీరోగా చేస్తున్న సినిమాలో రమ్యకృష్ణ విలన్‌గా చేయనున్నట్టు వస్తున్న వార్తలపై ఫ్యాన్స్​లో ఆసక్తి నెలకొంది. వీరిద్దరినీ ఒకే స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు చూస్తామా అని అందరూ ఎదురుచూస్తున్నారు. రజినీ (Rajinikanth) సినిమాలో విలన్‌గా చేయడానికి రమ్యకృష్ణ ఓకే చెప్పి ఉంటే గనుక ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక నెరవేరినట్టే మరి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!