దుల్క‌ర్ సల్మాన్ (Dulquer Salman) సినిమా 'సీతారామం' నుంచి లిరిక‌ల్ సాంగ్ రిలీజ్!

Updated on May 09, 2022 02:41 PM IST
సీతారామం మూవీ పోస్ట‌ర్ (Seetaramam Movie Poster)
సీతారామం మూవీ పోస్ట‌ర్ (Seetaramam Movie Poster)

త‌మిళ హీరో దుల్కర్ సల్మాన్‌ (Dulquer Salman), మృనాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా ఓ సినిమా రూపొంద‌నున్న‌సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమా లో నేష‌న‌ల్ క్ర‌ష్ రష్మిక మందన్నా కీలక పాత్రలో నటిస్తోంది. ఆమె ఈ సినిమాలో హీరోయిన్ కాదు కానీ ఒక హీరో రేంజ్ లో ఆమె ఈ సినిమాలో కనిపించబోతోందంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.  'సీతా రామం' అనే టైటిల్ తో తెర‌కెక్కుతున్న‌ ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఇటీవల దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ ఈ సినిమా లో ఆమె పాత్ర ఓ ప్రత్యేకతను కలిగి ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ నిర్మాణ సంస్థ‌ వైజయంతి మూవీస్ బ్యానర్‌ లో తెర‌కెక్కుతుండటం వల్ల మూవీపై తెలుగు ప్రేక్షకుల్లో మ‌రిన్ని అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. 

ఈ సినిమా లో ర‌ష్మిక‌ (Rashmika Mandanna) కనిపించినంత సేపు అద్భుతంగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక మందన్నా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరూ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, కరోనా స‌మ‌యంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కావ‌డానికి ఆలస్యం అయింది. దీంతో ఈ సినిమా ను త్వరలో విడుదల చేయబోతున్నారు.  అయితే, ఇప్పటి వరకు సీతా రామం సినిమా విడుదల విషయంలో వైజయంతి మూవీస్ వారు ఎలాంటి క్లారిటీ ఇవ్వక‌పోవ‌డం విశేషం.

అయితే, ఈ సినిమాను వచ్చే ఆగస్టు లో విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా స‌మాచారం అందుతోంది. ఆగస్టు లో పెద్ద సినిమాలు విడుద‌ల‌వుతున్న‌ నేపథ్యంలో ఓ సరైన సమయం చూసి విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారట. కాగా, దుల్కర్ సల్మాన్ కు కీర్తి సురేష్ న‌టించిన మహానటి సినిమా తో మంచి గుర్తింపు దక్కింది. ఆ సినిమాతో టాలీవుడ్ లో ఆయన ఒక స్టార్‌ గా మంచి పేరు దక్కించుకున్నాడు. కాబ‌ట్టి సీతారామం సినిమాతో సైతం ఖచ్చితంగా దుల్కర్ మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు లో వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా సీతారామం ఒక అద్బుతమైన దృశ్య కావ్యంగా ఉంటుందనే నమ్మకం కలుగుతోంది.

ఇదిలా ఉంటే.. ఇదివ‌ర‌కే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, హీరో హీరోయిన్ల ఇంట్ర‌డ‌క్ష‌న్ టీజ‌ర్‌లు సినిమాపై మంచి అంచ‌నాల‌ను పెంచాయి. ప్ర‌స్తుతం ఈ సినిమ‌మా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. దీంతో తాజాగా ఈ చిత్రం నుంచి మెలోడి సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఓ సీతా .. వ‌ద‌లనిక తోడ‌వుతా.. రోజంతా వెలుగులిడు నీడ‌వుతా’ అంటూ సాగే ఈ మెలోడియ‌స్‌ పాట శ్రోత‌ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. సంగీత ద‌ర్శ‌కుడు విశాల్ చంద్రశేఖ‌ర్ కంపోజ్ చేసిన ఈ పాట‌ను ఆయ‌నే స్వ‌యంగా ఆల‌పించాడు. గీత‌ర‌చయిత‌ అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించాడు. కాగా, ఈ చిత్రంలో దుల్క‌ర్ స‌ల్మాన్ లెఫ్టినెంట్ రామ్ పాత్ర‌లో న‌టించ‌గా మృనాల్ సీత పాత్ర‌లో న‌టిస్తోంది. (Rashmika Mandanna) ర‌ష్మిక కాశ్మీరి ముస్లిం అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!