'కెప్టెన్' (Captain) మూవీ ప్రమోషన్లలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ప్రశంసించిన కోలీవుడ్ హీరో ఆర్య (Hero Arya)

Published on Sep 07, 2022 06:56 PM IST

టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని హీరో‌ ఆర్య (Arya). ఈ తమిళ హీరో పలు తెలుగు సినిమాలతో ఇక్కడ కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. అయితే ఇటీవలే 'సారపట్టు' అనే సినిమాతో మంచి విజయం సాధించాడు. తాజాగా ఆర్య మరో కొత్త కథతో రాబోతున్నాడు. ఆర్య , ఐశ్వర్య లక్ష్మి జంటగా ఒక వింత జీవి పోరాటం నేపథ్యం లో తెరకెక్కిన 'కెప్టెన్' (Captain) అనే యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందుతోంది.  

'కెప్టెన్' (Captain Movie) సినిమా శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో థింక్ స్టూడియోస్, ది స్నో పీపుల్ బ్యానర్స్ పై తెరకెక్కుతోంది. ఇక.. ఈ మూవీ తమిళ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ సెప్టెంబర్ 8వ తేదీ రిలీజ్ కానున్నాయి. కెప్టెన్ మూవీ తెలుగు వెర్షన్ ను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అండ్ హీరో నితిన్ (Hero Nithiin) తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. 

'కెప్టెన్' (Captain Movie) సినిమాలో సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి డి ఇమాన్ సంగీతం అందించారు. ఇక, చిత్ర యూనిట్ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మంగళవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.

'కెప్టెన్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో ఆర్య (Arya) మాట్లాడుతూ.. అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ తో నటించడం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్ అనీ, అయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాననీ, ఆ మూవీ తో మా ఇద్దరి స్నేహం బలపడిందనీ చెప్పారు. కాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కిన 'వరుడు' సినిమాతో ఆర్య టాలీవుడ్ కు పరిచయమయిన సంగతి తెలిసిందే.

ఈ ప్రమోషన్స్ లో (Captain Promotions) భాగంగా ఆర్య మాట్లాడుతూ.. ఈ డైరెక్టర్ తో గతంలోనే సినిమా చేశాను. ఈయనకి గ్రాఫిక్స్ మీద మంచి పట్టు ఉంది. అందుచేత  కెప్టెన్ సినిమా ఒప్పుకున్నాను. ఇక ఈ సినిమా కోసం దాదాపు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ చేశాం. అంతేకాదు కెప్టెన్ సినిమాలో ఆర్మీ ఆఫీసర్‌ పాత్ర చేశాను అని పేర్కొన్నారు. 

Read More: సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajini Kanth) 'జైలర్' (Jailer) సినిమా ఆసక్తికర వార్త.. కీలక పాత్రలో కోలీవుడ్ హీరో?