సంగీతానికి భాష‌తో ప‌నేంటి!(Karolina) 

Updated on May 09, 2022 07:16 PM IST
తెలుగు పాట ఫారెన్ చిన్నారి వ‌యోలిన్‌లో మోత మోగుతుంది. తెలుగు లిరిక్స్ ఆ చిన్నారికి రాక‌పోయినా వ‌యోలిన్‌లో పలికిచ్చేస్తుంది. చూపే బంగార‌మాయ‌నే శ్రీవ‌ల్లి పాట‌తో త‌న దేశ ప్ర‌జ‌ల‌ను అల‌రిస్తుంది. 

కాలిఫోర్నియాకు చెందిన క‌రోలినా(Karolina) అనే 13 ఏళ్ల చిన్నారికి సంగీతం అంటే ప్రాణం. వ‌యోలిన్‌తో చ‌క్క‌టి సంగీతాన్ని అందిస్తుంది. కాలిఫోర్నియా వీధుల్లో వ‌యోలిన్ ప్లే చేస్తూ క‌రోలినా అక్క‌డి వాళ్ల‌కు వినోదం పంచుతుంది. 

క‌రోలినాకు క‌రోలినా ప్రోచెంకో వయోలిన్ (Karolina Protsenko Violin) అనే పేరుతో యూట్యూబ్ చాన‌లె ఉంది. ఆ ఛాన‌ల్‌లో ఎన్నో పాట‌ల‌కు వ‌యోలిన్ ప్లే చేస్తుంది. వీధుల్లో సూప‌ర్ హిట్ పాట‌ల‌తో వ‌యోలిన్ ప్లే చేయ‌డం త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ట‌. సూప‌ర్ హిట్ ఇంగ్లీష్ పాట‌లే కాకుండా చాలా భాష‌ల్లో హిట్ సాంగ్స్‌ను ప్లే చేస్తుంది. ఉక్రేయిన్ కోసం వాళ్ల జాతీయగీతం కూడా ప్లే చేసింది.ఉక్రేయిన్ వార్ ఆపాలంటూ త‌న వ‌యోలిన్ ద్వారా తెలింపింది. 

రీసెంట్‌గా కరోలినా(Karolina)  తెలుగు పాటను త‌న వ‌యోలిన్‌తో పాడించింది. పుష్ప సినిమాలోని చూపే బంగార‌మాయ‌నే.. శ్రీవ‌ల్లి.. పాట‌ను క‌రోలినా వ‌యోలిన్‌తో ప‌లికించింది. ఆ పాటను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. క‌రోలినా శ్రీవ‌ల్లి సంగీతాన్ని ఇండియ‌న్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రిధ‌మ్ మిస్ కాకుండా సూప‌ర్‌గా వ‌యోలిన్ ప్లే చేసిందంటూ మెచ్చుకుంటున్నారు. 

ఇండియ‌న్ సినీ ఇండ్ర‌స్ట్రీ ప్ర‌ముఖులు క‌రోలినా(Karolina)  వ‌యోలిన్ పాట‌లు చూస్తే క‌చ్చితంగా ఫిదా అవ్వాల్సిందే. టాలీవుడ్ ప్రముఖులు కాలిఫోర్నియా వెళితే క‌రోలినాతో క‌చేరీ చేయిస్తారేమో. తెలుగు, హిందీ పాట‌లకు అద్భుతంగా వ‌యోలిన్ వాయిస్తుంది. ఇక సంగీత ప్ర‌ముఖులు క‌రోలినాతో కొత్త సినిమాల‌కు వ‌యోలిన్ ఆరిస్టుగా సెల‌క్ట్ చేసుకుంటారేమో చూడాలి.  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!