కియారా(Kiara Advani), సిద్దార్థ్ (Sidharth Malhotra) బ్రేకప్ నిజమేనా?

Updated on Apr 23, 2022 09:12 PM IST
కియారా(Kiara Advani), సిద్దార్థ్ (Sidharth Malhotra) బ్రేకప్ నిజమేనా?
కియారా(Kiara Advani), సిద్దార్థ్ (Sidharth Malhotra) బ్రేకప్ నిజమేనా?

బాలీవుడ్​ భామ కియారా అద్వాణీ (Kiara Advani),  యంగ్​ హీరో సిద్దార్థ్​ మల్హోత్రా (Sidharth Malhotra) తమ ప్రేమప్రయాణానికి ముగింపు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ జంట  ప్రేమలో ఉందని  కొన్నాళ్లుగా  ప్రచారం జరుగుతోంది. పార్టీలు, ఫంక్షన్లలో ఇద్దరూ జంటగా కనిపించడంతో నిజంగానే వారిద్దరు ప్రేమలో ఉన్నారనుకున్నారు అభిమానులు.  అయితే తమ ప్రేమ విషయాన్ని ఇద్దరూ ఎక్కడ ప్రస్తావించలేదు. షేర్షా సినిమాతో రీల్​ కపుల్​గా ప్రేక్షకుల మనసు దోచిన కియారా అద్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్​ మల్హోత్రా(Sidharth Malhotra) ఆ సినిమా షూటింగ్​లోనే ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది.

ఇద్దరూ కలిసి డిన్నర్లు, హాలీడే ట్రిప్పులంటూ విదేశాల్లో చక్కర్లు కొట్టడంతో పెళ్లెప్పుడంటూ.. కలర్​ఫుల్​ కపుల్​ అంటూ   సోషల్​ మీడియాలో అభిమానులు కామెంట్లు, లైక్​లతో వీరి ప్రేమాయణం జోరుగా సాగింది. ఆలియా, రణ్​బీర్​ తర్వాత పెళ్లి చేసుకోబోయే జంట వీరిదేననుకున్నారంతా.  అయితే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్లే ఇద్దరూ తమ బంధానికి స్వస్తి పలికి వారివారి కెరీర్​పై కియారా అద్వాణీ (Kiara Advani),  సిద్దార్థ్​ మల్హోత్రా (Sidharth Malhotra) దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. బ్రేకప్​ వల్లే ఇద్దరూ ఎక్కడ కలిసి కనిపించడం లేదని అటు బీ టౌన్​లోనూ ఇటు మీడియాలోనూ ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా ఇద్దరూ నోరు మెదపకపోవడం గమనార్హం.

లస్ట్​ సోరీస్​తో ఓవర్​నైట్​ స్టార్​డమ్​ కొట్టేసిన కియారా టాలీవుడ్​లోనూ భరత్​ అను నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పుపొందింది.  ప్రస్తుతం కియారా కియారా అద్వాణీ (Kiara Advani)  భూల్​భులాయా2లో నటిస్తోంది. ఈ సినిమా మే 20న విడుదల కానుంది. వరుస సినిమాలతో స్టార్​గా ఎదిగిన సిద్దార్థ్​ మల్హోత్రా కూడా తన సినిమాలతో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.  బీటౌన్​లో ఓ వైపు పెళ్లి భాజాలు మొగుతుంటే మరోవైపు బ్రేకప్​ల ట్రెండ్​ నడుస్తోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!